ఏపీలా.. మోడీ చేస్తానంటే కెసిఆర్ సహకరించట్లేదు: కిషన్, నీకేం తెల్సు: తలసాని

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ సహకరించడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం ఆరోపించారు.

కేంద్రం సహకారంతో ఏపీలో 24 గంటల విద్యుత్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తోంది. అలాగే, తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తుంటే కెసిఆర్ సహకరించడం లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కెసిఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమయిందని ప్రశ్నించారు. పథకాలు ప్రకటిస్తున్నారు కానీ ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు. అనేక ప్రాజెక్టులు సగంలోనే వదిలేశారన్నారు. 12 విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరన్నారు.

తెలంగాణను వ్యతిరేకించిన వారే ఇప్పుడు పాలన సాగించడం బాధాకరమన్నారు. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు తాము పోరాడుదామని చెప్పారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదన్నారు.

మద్యాన్ని నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే వీధివీధిలో బీరు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు.

 PM Modi is ready to give 24 hours power to Telangana: Kishan Reddy

చైనాకు దురదృష్టకరం: ఉత్తమ్

తెలంగాణలో కెసిఆర్ పాలన కుటుంబ పాలనగా మారిందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు రైతులు, ప్రజలు అల్లాడుతుంటే కెసిఆర్ చైనా పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు.

తెలుసుకోండి: తలసాని

స్వచ్ఛ భారత్ నిధుల పైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి దానం నాగేందర్ పైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం మండిపడ్డారు. స్వచ్ఛ హైదరాబాద్ గురించి మీ ఎమ్మెల్యేలనే అడిగి తెలుసుకోవాలి తలసాని సూచించారు.

స్వచ్ఛ భారత్‌కు విపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందన్నారు. అయినా ఓడిపోయిన నీకేం తెలుసని దానంను ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్ కింద అనేక కార్యక్రమాలు జరిగాయి, జరుగుతున్నాయన్నారు. దానం స్థాయికి తగ్గట్లు మాట్లాడాలన్నారు. తెలియకుండా మాట్లాడొద్దని, కనీసం తెలుసుకొని మాట్లాడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+