హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ; స్వాగతం పలికిన తమిళిసై; తెలుగులో మోడీ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటల 35 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళ్ సై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి విమానాశ్రయంలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి కూడా స్వాగతం పలికారు.
మరోవైపు బీజేపీ ముఖ్య నేతలు కూడా ప్రధానికి స్వాగతం పలికారు. నగరంలో రెండు గంటల పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చెయ్యనున్నారు. ఈ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

తెలంగాణా పర్యటనపై ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలోనూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా 11 వేల 355 కోట్ల రూపాయిల విలువ గల పలు ప్రాజెక్టులకు వర్చ్యువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేస్తారు.
హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k
— Narendra Modi (@narendramodi) April 8, 2023
బీబీనగర్ లోని ఎయిమ్స్ కు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రైల్వే లైన్ ను జాతికి అంకితం చేస్తారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ లో ప్రసంగించనున్నారు.
Prime Minister Narendra Modi landed in Hyderabad a short while ago. He was received by Governor Dr Tamilisai Soundararajan and other dignitaries: PMO pic.twitter.com/HjIwdOjixm
— ANI (@ANI) April 8, 2023
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పదవ నంబర్ ప్లాట్ ఫారం పై ఈ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రయాణికులను అనుమతించరు. ఆ సమయంలో కార్లు, ద్విచక్ర వాహనాల వంటివి పరిసరాలలో నిలిపేందుకు అనుమతించబోమని రైల్వే అధికారులు తెలిపారు. కాగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రేపటి నుంచి ప్రయాణికులకు రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications