కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే.. బీఆర్ఎస్‌కే ఓటేయండి: ‘కర్ణాటక’ తప్పు వద్దంటూ మోడీ
భోపాల్: తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని.. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో నిర్వహించిన 'మేరా బూత్.. సబ్‌సే మజ్‌బూత్' అనే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని.. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన దాదాపు 10 లక్షల మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్బంగా కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. మీకు, మీ బిడ్డలకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటేయ్యాలని.. కేసీఆర్ బిడ్డకు లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్‌కు ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు.
కర్ణాటక ప్రజలు చేసిన తప్పును తెలంగాణ ప్రజలు చేయొద్దన్నారు. తన మాట దేశమంతా వినాలంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర ప్రభుత్వం కవితకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న సమయంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇక ఇటీవలి విపక్షాల భేటీపై ప్రధాని మోడీ తనదైన శైలిలో చురకలంటించారు. అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయన్నారు. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయన్నారు. తాను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నా అని అన్నారు ప్రధాని మోడీ.
బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానమన్నారు. పార్టీకన్నా.. దేశమే ప్రాధాన్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
Do not follow the blunders of Karnataka and vote for some pariwarwadi
— Sanatani Thakur 🇮🇳 (@SanggitaT) June 27, 2023
Telangana..If you want to see KCR family grow vote for BRS..if you want to see your children Prosper vote for BJP . pic.twitter.com/iMFC2fRxiU
బుజ్జగింపులు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్నవారు.. ముస్లిం బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పౌరస్మృతి పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. అయితే, వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలి? ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు పనిచేయవన్నారు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించే చెబుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశానికి చేటు చేస్తున్నాయని విమర్శించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications