రేపు హైదరాబాద్ కు ప్రధాని మోడీ; బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈనెల 7వ తేదీన ఆయన హైదరాబాద్ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపధ్యంలో బీజేపీ నేతలలో రెట్టించిన జోష్ నెలకొంది.

ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 5 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నర నుండి 6 గంటల 15 నిమిషాల వరకు వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 నిమిషాలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

PM Modi to Hyderabad tomorrow; Attending the BC atma gourava sabha!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ లో జరిగే BC ఆత్మ గౌరవ సభకు హాజరుకానున్నారు. బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోడీ రావడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. బీసీలకు భరోసా ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో మాట్లాడతారని, బీసీలకు హామీలను ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

అయితే ఈ సభను సక్సెస్ చేయడం కోసం బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ లోని LB స్టీడియంలో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు సాయంత్రం పాల్గొనున్నారు. ప్రధానమంత్రి బహిరంగ సభ కు జరుగుతున్న ఏర్పాట్లను BJP రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చూగ్, రాష్ట్ర అధ్యక్షులు G కిషన్ రెడ్డి పరిశీలించారు.

మొత్తం ఈ సభకు లక్ష మందిని తరలించాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రేపటి సభ తర్వాత మళ్లీ 11వ తేదీన పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+