చర్లపల్లి రైల్వే టెర్మినల్ విషయంలో సీఎం రేవంత్ కు కేంద్రమంత్రి లేఖ!

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్,చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కు వెళ్ళే రోడ్డు విస్తరణ పనుల గురించి రాష్ట్రప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలుగా ప్రత్యేక శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం చూపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

చర్లపల్లిలో 415కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం
రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి మిషన్ మోడులో పూర్తవుతోందని, కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ తో పాటు లైన్ ల ఎలక్ట్రిఫికేషన్ పనులు 40కి పైగా స్టేషన్ల అభివృద్ధిపనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లిలో 415కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవుతుందని వెల్లడించారు.

PM Modi to inaugurate Charlapally Railway Terminal Union Minister kishan reddy letter to CM Revanth reddy

ప్రధాని చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్వయంగా ప్రారంభిస్తారన్న కేంద్ర మంత్రి
ఇక హైదరాబాద్ కు సంబంధించిన ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రం కానుందని, ఇది దాదాపుగా పూర్తయిందని, మౌలిక వసతులు కల్పన కూడా పూర్తి కావచ్చిందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను స్వయంగా వచ్చి ప్రారంభిస్తామని ప్రజలకు అంకితం చేస్తానని చెప్పారని తెలిపారు.

రోడ్డు విస్తరణ కోసం రేవంత్ రెడ్డికి లేఖ
ఇక ఇలాంటి కీలకమైన రైల్వే టెర్మినల్ ను చేరుకోవడానికి ఎఫ్సీఐ గోదాం నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100అడుగుల రోడ్డు నిర్మాణం అవసరం ఉందని, అలాగే ఉత్తరం వైపు భరత్ నగర్ వైపు కూడా 80అడుగుల రోడ్డు, మహాలక్ష్మీ నగర్ వైపు మరో 80అడుగుల రోడ్డు అవసరం అవుతుందని, దీంతో పాటు ఇండస్ట్రియల్ షెడ్స్ ముందు ఉన్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సీఎం చొరవ తీసుకోవాలి
దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నానని తెలిపారు. రైల్వే టెర్మినల్ పనులు పూర్తయి రైల్వే స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే సమయానికి రోడ్డు విస్తరణ పనులు పూర్తయి ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు దోహదం చేసేలా సీఎం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీరు తీసుకునే ఈ చొరవ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఎంతో సహాయపడుతుందని తాను ఆశిస్తున్నాననీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+