ప్రపంచానికి కొత్తదారులు చూపాలి, రైతులకు అండగా ఉన్నాం: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోడీ

హైదరాబాద్: ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారులు చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోడీ అభినందించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగోను, స్టాంప్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Recommended Video

    PM Narendra Modi : The Govt Always Supprts Farmers | ICRISAT Golden Jubilee | Oneindia Telugu

    వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలని ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు సూచించారు. గత 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ ఉద్యోగులకు ప్రధాని అభినందనలు తెలిపారు. వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలు తయారు చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేయాలన్నారు ప్రధాని మోడీ. ప్రకృతి సాగుకు, డిజిటల్ విధానంలో వ్యవసాయ విధానాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.

     PM Narendra Modi speech at icrisat hyderabad golden jubilee event

    సాగులో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని మోడీ చెప్పారు. పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. నిల్వ వసతులు పెంచుతామని అన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని.. అందరికీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

    భారతదేశంలో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారని తెలిపారు. చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని, పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలన్నారు ప్రధాని మోడీ. దేశంలో 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రధాని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడుతున్నట్లు మోడీ తెలిపారు.

    ఈ ఏడాది బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నామని, సాగులో డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. సాగు భూముల వివరాలను డిజిటలైజ్ చేశామని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. డిజిటల్ అగ్రికల్చర్ తో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు రానున్నాయని వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+