సైనికుల పట్ల చేసిన వ్యాఖ్యలకు పీఎం రిప్లై ఉంటుంది.!కేసీఆర్ సిద్దంగా ఉండాలన్న పొంగులేటి.!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేశ సరిహద్దులో పహారా కాస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రంలో లోతైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేశ సమగ్రతకు, అంతర్గత భద్రత గురించి, అన్నిటికన్నా ముఖ్యమైన సార్వభౌమాదికారం గురించి అసందర్బంగా, చులకనగా చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఖచ్చితంగా ఉంటుందని బీజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేసారు.

దంచి కొడుతున్నారు.. సరిహద్దు సైనికుల పై సీఎం వ్యాఖ్యలను ఖండించి బీజేపి
చైనా సరిహద్దులో భారతదేశానికి సంబంధించిన భద్రతా సిబ్బంది పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యాఖ్యల నేపధ్యం ఏంటి.?ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని రక్షించే సైనికుల వీరత్వాన్ని, తెగుంపును సీఎం హోదాలో ఎందుకు కించపరిచే కోణంలో సంభోదించారు అనే అంశంపై కేంద్ర వర్గాల్లో లోతైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేశంలోని ఓ సాధారణ పౌరుడు ఇలా వ్యాఖ్యానిస్తే వేరేగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఏంటనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

దేశ భద్రత గురించి సీఎం అనుచిత వాఖ్యలా..? తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర బీజేపి
రాజ్యంగ బద్దంగా ఉన్నత పదవుల్లో ఉన్న విశిష్ట వ్యక్తులు దేశానికి సందంధించిన కీలక అంశాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి సరైన సమాధానం కూడా ఘాటుగా ఉంటుందని కేంద్ర నాయకులు స్పష్టం చేస్తున్నారు. వారం రోజుల క్రితం సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా కేంద్రం తీవ్రంగా పరిగణిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించినట్టు తెలస్తోంది. జాతీయ మీడియాతో ఇదే అంశంపై పొంగులేటి సుదాకర్ రెడ్డి ఆసక్తికర అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

రాజకీయ ఆరోపణలు సాధారణం.. అభ్యంతరకర వ్యాఖ్యలు ఎందుకన్న బీజేపీ
సుధీర్గ కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి సందర్బంగా ప్రజలకు వివరణ ఇస్తారని తెలంగాణ ప్రజానికం భావించారు. కాని అందుకు విరుద్దంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించి స్పందించ కుండా రాష్ట్ర బీజేపి నేతలను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసారు సీఎం చంద్రశేఖర్ రావు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షచూపిస్తున్నా ఎందుకు ప్రశ్నించరనే కోణంలో తెలంగాణ బీజేపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేసారు. పనిలో పనిగా తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, ప్రధాని మోదీ విధానాలను కూడా ఎండగట్టే ప్రయత్నం చేసారు.
Recommended Video

ప్రధాని సమాధానం చెబుతారు.. సీఎం సిద్దంగా ఉండాలన్న బీజేపి నేత
ఇదిలా ఉండగా ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో సహజం అనుకున్నారు ప్రజలు. కానీ కట్టలు తెంచుకున్న కోపాన్ని నియంత్రించుకోలేక దేశ భద్రత గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కులు కొని తెచ్చుకున్నారు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు. ఇదే అంశం పట్ల కేంద్ర స్ధాయిలో చర్చ జరుగుతోంది. దేశ సమగ్రత, భద్రత గురించి సీఎం స్థాయిలలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని సూటిగా ప్రశ్నిస్తున్నారు కేంద్ర బీజేపి నాయకులు. విదేశాల్లో ఉన్న ప్రధాని మోదీ ఈ అంశం పట్ల దృష్టి కేంద్రీకరిస్తారని, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలకు ధీటైన, ఘాటైన సమాధానం ఉంటుందని బీజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించడం మొత్తం ఎపిసోడ్ ను ఉత్కంఠభరితంగా మార్చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications