జీవన్ రెడ్డి బాటలో మరో సీనియర్, తిరుగుబాటు- గులాబీ గూటికి..!?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు సీనియర్ నేతలు పార్టీ.. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో నాలుగు దశాబ్దాలు గా పని చేసిన జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. గులాబీ కండువా కప్పుకోవటానికి సిద్దమయ్యారు. ఇక, ఇప్పుడు మరో సీనియర్ నేత కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేసారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి. ఇప్పటికే జీవన్ రెడ్డి అంశం కాంగ్రెస్ లో చర్చగా మారింది. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. రేవంత్ పాలనతో కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారిందని విమర్శించారు. పీసీసీ కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొంత కాలం క్రితం బీఆర్ఎస్ తో పోచారం దూరమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల తీరుపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రిజర్వాయర్ వద్ద బైఠాయించి బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని చెప్పారు.

pocharam-srinivasa-reddy-rebellion-against-congress-government-says-chief-minister-breaks-his-word

పోచారం నిర్ణయం ఏంటి

బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. తద్వారా భూములకు సాగునీరు అందే అవకాశం ఉండదని చెప్పారు. మంత్రులు, ముఖ్యమంత్రి తన ఫోన్ కు సమాధానం ఇవ్వటం లేదని చెప్పుకొచ్చారు. నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మాట ఇచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిధుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 20సార్లు అడిగినా పట్టించుకో లేదని, ఈవయస్సు లో నిధులు మంజూరు చేయాలనీ మంత్రుల కాళ్లు మొక్కలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హాయంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం పాలన నడుస్తుందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రజా ప్రతినిధుల సమస్యల కోసం అర్ధరాత్రి ఫోన్ వచ్చినా స్పందించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేసే నేతల ఫోన్‌లను కూడా లిఫ్ట్ చేయకపోవడం సరైన పద్ధతి కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోచారం ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయటం ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటనే చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+