కలికాలం అంటే ఇదేనేమో.. మహిళపై పోక్సో కేసు !
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా బాలికలపై లైంగిక వేధింపులు జరిగిన తరుణంలో.. నిందితుడిపై పోక్సో చట్టం (POCSO Act) నమోదు చేసిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం ఓ మహిళపైనే పోక్సో కేసు నమోదు అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ అనూహ్య ఘటన సత్తుపల్లి పట్టణంలో జరిగింది. స్థానికంగా నివసిస్తున్న ఓ వివాహిత.. భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడితో ప్రేమలో పడింది. కొంతకాలం ప్రేమలో కొనసాగిన అనంతరం.. ఆ బాలుడిని తీసుకుని పరారైంది.

దీంతో తమ కుమారుడు కనిపించకపోవడంతో.. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళే బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. మహిళపై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసి.. బాలుడిని సురక్షితంగా తీసుకువస్తామని తెలిపారు.
ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చిన్నారుల భద్రతపై సమాజం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. పోక్సో చట్టం లింగానికి సంబంధం లేకుండా పనిచేస్తుందని, నేరం చేసిన వారెవరికైనా శిక్ష తప్పదని వివరించారు.
పోక్సో చట్టం అంటే ఏమిటి..?
పోక్సో అంటే Protection of Children from Sexual Offences Act, 2012. ఇది 18 సంవత్సరాల లోపు బాలురు, బాలికలను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించిన చట్టం. ఈ చట్టం ప్రకారం, మైనర్ పిల్లలతో శారీరక సంబంధాలు, లైంగిక వేధింపులు చేసిన వారెవరికైనా.. కఠిన శిక్షలు విధించబడుతుంది.












Click it and Unblock the Notifications