బాత్రూం నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రగానే దాడి: భర్త అరెస్ట్, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తం
హైదరాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్న సైదాబాద్ పూసల బస్తీకి చెందిన సుశృత కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. సుశృత భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారించారు. శవ పంచనామా కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఉస్మానియా వద్ద ఆందోళన
సోమవారం ఉదయం సుశృత బంధువులు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. ఆత్మహత్యకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు.

భర్త మోహన్‌తోపాటు అత్త, మామలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడంతో ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తత కనిపించింది. వారికి పోలీసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు నచ్చచెప్పినా వినలేదు.
భర్త కర్కశత్వం: బాత్రూం నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రను చేసి దాడి, ఆత్మహత్య
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అప్పటికే సుశృత భర్త మోహన్, అత్త, మామలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బాత్రూంలో వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ ఎక్కువగా పెట్టిందని చెప్పి భర్త మోహన్ సుశృతను విచక్షణా రహితంగా కొట్టడంతో, ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
తప్పయిందని, క్షమించమని వేడుకున్నా వినలేదు. వివస్త్రగా ఉన్న ఆమెను కొట్టుకుంటూనే బయటకు తీసుకు వచ్చాడు. అత్తామామలు, తోడి కోడలు, ఇతర కుటుంబ సభ్యులు చూస్తుండగా బట్టలు లేకుండానే ఆమెను కొట్టాడు. అత్తమామలు కూడా అతనికే మద్దతు పలికారు. ఆ అవమానాన్ని భరించలేక ఆమె వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు సందేశం పంపించి ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications