పేకాట స్థావరాలపై దాడి: పట్టుబడ్డ నటి కళ్యాణి

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జహంగీర్‌నగర్‌లో పేకాట స్థావరాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 11మందిని అరెస్ట్‌ చేసి రూ.77వేల నగదు, 8సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సినీనటి కళ్యాణి కూడా ఉన్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అర కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద అరకిలో బంగారం ఉన్నట్టు గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Police attacked Ombre base: Actress Kalyani arrest

భార్య గొంతు కోసిన భర్త...

భార్యతో గొడవపడి ఆమె గొంతుకోసిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రసూల్‌పుర అన్నానగర్, బాలంరాయి ప్రాంతానికి చెందిన ఫాతిమా (30), దూద్‌ఫిరా దంపతులకు పది సంవత్సరాల కిందట వివాహాం జరిగింది.

వారికి ఓ అమ్మాయి(9), కొడుకు(7) సంతానం. కాగా, భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. 15రోజుల క్రితం గొడవ జరగడంతో ఫాతిమా పుట్టింటికి వెళ్లింది. అయితే ఆదివారం సాయంత్రం భర్త దూద్‌ఫిరా అత్తారింట్లో ఉన్న ఫాతిమాను కత్తితో గొంతు కోశాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని తీవ్రంగా కొట్టారు. అనంతరం ఇద్దరిని చికిత్స కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+