అమ్మకానికి పెడితే వ్యభిచార గృహంగా మార్చాడు
హైదరాబాద్: నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం ఇద్దరు విటులు, యువతులు, నలుగురు మహిళలతోపాటు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి ఘటనలో బాలానగర్‌లోని అమ్మకానికి పెట్టిన ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా ఉద్యోగానికి కుదిరిన వ్యక్తి ఆ ఇంటిని వ్యభిచార గృహంగా మార్చాడు.
సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు, అతని భార్యను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముచ్చెర్ల సీతారామయ్య(65), భార్య కృష్ణవేణి(60)తో నగరానికి వలస వచ్చి ఐడిపిఎల్ ఏపిహెచ్‌బికాలనీలో అమ్మకానికి పెట్టిన ఓ ఇంటికి వాచ్‌మెన్‌గా ఉద్యోగానికి కుదిరాడు. ఇంటి యజమాని షాపూర్‌నగర్‌లో నివాసముండటాన్ని అదనుగా తీసుకుని పరిచయస్తులు, స్నేహితుల భార్యలను, వితంతువులను డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయించేవాడు.

ఈ క్రమంలో విజయవాడ, రాజమండ్రి, చిన్నపట్నం, పాలకొల్లు ప్రాంతాలకు చెందిన నలుగురు మహిళతో వ్యభిచారం నిర్వహించసాగాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆ ఇంటిపై దాడి చేశారు. వాచ్‌మెన్, అతడి భార్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు మహిళలతను రెస్క్యూ హోంకి తరలించారు.
రెండో ఘటన నగరంలోని బుద్ధానగర్‌లో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన దివ్య పీర్జాదిగూడ బుద్ధానగర్‌లోని శ్రీసాయిలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాటు అద్దెకు తీసుకుని అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తోంది. తమకు అందిన సమాచారంతో బుధవారం సాయంత్రం పోలీసులు ఆ ఫ్లాటుపై దాడి చేశారు. దివ్యతోపాటు విటులు రాజు, వెంకటరమణ, ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications