రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్, ససేమిరా అనడంతో హత్య, వీడిన చేపల వ్యాపారి హత్య మిస్టరీ
చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. శ్రీనివాస్ అలియాస్ రాజు హతమార్చారని పోలీసులు తెలిపారు. అనురాధ అనే మహిళతో రమేశ్‌కు ఫోన్ చేయించి పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. డబ్బుల కోసమే హత్య చేశారని.. పాత కక్షలు ఏం లేవని భావిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.

ఏం జరిగిందంటే..
బోబండలోని రామారావునగర్‌కి చెందిన రమేశ్ చేపల వ్యాపారి. చేపల వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన రమేశ్.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. రమేశ్ సంపాదన గురించి తెలిసిన శ్రీనివాస్ నగదు గుంజాలని పథకం రచించారు. ఈ నెల 1వ తేదీన అనురాధ అనే మహిళను ముగ్గులోకి దింపాడు. ఆమె రమేశ్‌కి ఫోన్ చేసి తనవద్దకు రమ్మని చెప్పింది. అతను గుడ్డిగా శ్రీనివాస్ అద్దెకు తీసుకున్న జవహర్ నగర్‌లోని గదిలోకి వచ్చాడు.

డబ్బుల కోసమే..
అప్పటికే శ్రీనివాస్, అనురాధ, మరో మహిళ కూడా అక్కడ ఉన్నారు. నగదు ఇవ్వాలని బెదిరించడంతో.. అతను వినకపోవడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రమేశ్‌ను హతమార్చిన తర్వాత అక్కడినుంచి శ్రీనివాస్, అనురాధ జారుకున్నారు. కానీ రమేశ్ మొబైల్ తీసుకెళ్లారు. రమేశ్ మేనకోడలుకు శ్రీనివాస్ వాట్సాప్‌లో సందేశం పంపించారు. రమేశ్‌ను కిడ్నాప్ చేశామని, రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మొబైల్ లొకేషన్ ఆధారంగా..
రమేశ్ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగింది. రమేశ్ హత్య తర్వాత నిందితులు పక్క రాష్ట్రం ఏపీకి పారిపోయారు. కానీ వారి మొబైల్ ఆధారంగా పోలీసులు ట్రాప్ చేశారు. వారిని అరెస్ట్ చేశారు. రమేశ్‌ను హతమార్చాక.. ఈ నెల 3వ తేదీన శ్రీనివాస్ జవహర్‌నగర్‌లోని గదికి వచ్చాడు. యాజమానికి అద్దె ఇచ్చి మెల్లగా ఏపీకి జారుకున్నాడు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications