వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయి కూడా ఎందరో జీవితాలలో వెలుగులు నింపిన పోలీస్ కానిస్టేబుళ్ళు.. హ్యాట్సాఫ్ పోలీస్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేసిన కానిస్టేబుల్స్ వారి మరణానంతరం కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాద ఘటనలు పోలీసుల సేవానిరతికి అద్దం పడుతున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ కు రోడ్డు ప్రమాద ఘటనలో బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఇక వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న సెల్వం సతీష్ అనే కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడి మరణించగా అతని అవయవాలను కూడా కుటుంబ సభ్యులు వేరే వారి జీవితంలో వెలుగు నింపడానికి దానం చేశారు.

యశోద ఆసుపత్రి నుండి అపోలో ఆసుపత్రి వరకు పోలీసులు గ్రీన్ ఛానల్

యశోద ఆసుపత్రి నుండి అపోలో ఆసుపత్రి వరకు పోలీసులు గ్రీన్ ఛానల్

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మే 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయనను మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో అవయవ దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి విజయ్ కుమార్ గుండెను అమర్చనున్నారు దీనికోసం పేట మలక్ పేట యశోద ఆసుపత్రి నుండి అపోలో ఆసుపత్రి వరకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ కమీషనరేట్ కానిస్టేబుల్

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ కమీషనరేట్ కానిస్టేబుల్


వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఫిర్యాదుల విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సెల్వం సతీశ్ మూడు రోజుల క్రితం విధులకు హజరయ్యేందుకు తన సహోద్యోగి ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఖమ్మం-హనుమకొండ ప్రధాన రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్యాస విడిచాడు. ఈ సంఘటన తో కన్నీరుమున్నీరై విలపిస్తున్న సతీష్ కుటుంబ సభ్యులు సతీష్ ఆశయాలకు జీవం పోయాలని సంకల్పించారు. సతీష్ మరణించిన నలురుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో మరణించిన సతీష్ ఆవయవాలను దానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సతీష్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అభినందించిన సీపీ తరుణ్ జోషి

సతీష్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అభినందించిన సీపీ తరుణ్ జోషి


ఈ సందర్బంగా సతీష్ పార్థీవదేహం నుండి అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన సతీశ్ కుటుంబ సభ్యులను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషితో సహా స్థానికులు అభినందించారు. తమ మిత్రుడు తన జీవిత చివరి అంకంలోను ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపినందుకు గాను సతీశ్ మా మిత్రుడైనందుకు గర్వపడుతున్నట్లుగా 2009 బ్యాచ్ కానిస్టేబుళ్లతో పాటు సహోద్యోగులు అశ్రునయాలతో సతీష్ కు తుది వీడ్కోలు పలికారు. చనిపోయిన తర్వాత కూడా ఎందరో కుటుంబాలలో అవయవ దానంతో వెలుగులు నింపుతున్న పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ శాఖకు వన్నె తెచ్చారు. తన కుటుంబ క్షేమం కన్నా సమాజ క్షేమం కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తుదకు తన మరణాంతరం కూడా తన ఆవయవదానం చేసి గొప్పవారిగా మిగిలిపోయారని పోలీసులు చెప్తున్నారు.

English summary
Police constables who lit up the lives of many even after their death. Vijay Kumar, a constable at Nagarjunasagar police station, Selvam Satish, a constable working at Warangal Police Commissionerate, family members donated their organs to brighten their lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X