ఏటీఎం చోరీకి విఫలయత్నం: దొంగల వాహనంపై పోలీసుల కాల్పులు

మెదక్: పట్టణంలోని ఆటోనగర్‌ ఎస్‌బీఐ ఏటీంలో చోరీకి యత్నించిన దొంగలు నిజామాబాద్‌ జిల్లా లింగంపేట వైపు పరారయ్యారు. మెదక్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో దండగులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లింగంపేట సమీపంలో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు.

దొంగలు ఆపకుండా వేగంగా వెళ్లడంతో లింగంపేట ఎస్‌ఐ రాకేశ్‌ దుండగుల వాహనంపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. అతివేగంగా వెళ్తున్న హనానాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దండగుల వాహనం భవానీపేట్‌ నుంచి గాంధారీ అటవీప్రాంతంలోకి వెళ్లింది.

ఎల్లారెడ్డి సీఐ అనిల్‌కుమార్‌ నేతృత్వంలో ఎల్లారెడ్డి ఎస్‌ఐ, గాంధారి ఎస్‌ఐ, లింగంపేట ఎస్‌ఐలు లింగంపేట అటవీప్రాంతంలో గాలింపు చేపట్టారు. కామారెడ్డి డీఎస్పీ భాస్కర్‌, సీఐ ఘటనాస్థలిని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు.

Police firings at thieves

కాగా, నిజామాబాద్, మెదక్‌లో ఏటీఎంలను మహారాష్ట్ర గ్యాంగ్ లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా పలు ఏటీఎంలు లూటీ చేసింది. కోటగిరి, వర్ని మండలాల్లో నాలుగు ఏటీఎంలు ధ్వసం చేశారు. రూ.43 లక్షల వరకు మహారాష్ట్ర గ్యాంగ్ అపహరించినట్లు తెలిసింది. సీసీ కెమెరాలకు దోపిడీ దృశ్యాలు చిక్కాయి.

కలహాలు: అన్నను హత్య చేసిన తమ్ముడు

మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం పల్లెరూటిపెంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను వేధిస్తున్నాడని అన్న శ్రీను(22)ను తమ్ముడు అంజయ్య హత్య చేశాడు. గొడ్డలితో శ్రీనును అంజయ్య నరికి చంపాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+