ఉప్పల్ నరబలి: డీఎన్ఏ రిపోర్ట్ వచ్చేసింది.., వాటితో మ్యాచ్ అయితే మరో మలుపు తిరిగినట్టే?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఉప్పల్‌ నరబలి కేసులో నిజానిజాలను నిర్దారించే డీఎన్ఏ రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది. రిపోర్ట్ ఆధారంగా చిన్నారి లింగ నిర్దారణతో పాటు, అసలు జరిగింది నరబలా?.. కాదా?.. అన్నది నిర్దారించనున్నారు. గత 14 రోజులుగా పోలీసులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నా.. కేసు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆశ్రయించారు.

  Human Sacrifice Baby's Head Case Mystery Solved

  ఉప్పల్ నరబలి: తెరపైకి కొత్త అనుమానం.., ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారి తల భాగం!

  అందిన డీఎన్ఏ రిపోర్ట్:

  అందిన డీఎన్ఏ రిపోర్ట్:

  ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం చిన్నారి తల భాగంలోని ఒక ముక్కను, వెంట్రుకలను పోలీసులు టెస్టులకు పంపించారు. ఫోరెన్సిక్ నుంచి వచ్చిన డీఎన్‌ఏ రిపోర్టులు బధవారం రాత్రి పోలీసులకు అందినట్లు సమాచారం.

  ఉప్పల్ నరబలి కేసులో కీలక ఆధారాలు: గదిలో రక్తపు మరకలు, కోడిని కోశామంటూ..

  వాళ్ల డీఎన్ఏ కూడా..:

  వాళ్ల డీఎన్ఏ కూడా..:

  చిన్నారి ఎవరి బిడ్డ అయి ఉంటుందన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాకపోవడంతో.. మిస్సింగ్, కిడ్నాప్ కేసులపై కూడా పోలీసులు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప్పల్ లోని రాజశేఖర్ ఇంట్లో చిన్నారి తల దొరకడానికి కొద్దిరోజుల ముందు నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. మిస్ అయిన చిన్నారుల తల్లిదండ్రుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు.

  ఉప్పల్ నరబలి: వెలుగులోకి మరిన్ని సంచలనాలు.. ఆర్నెళ్లుగా వాళ్లతో టచ్‌లో రాజశేఖర్?

  పోల్చి చూసి తేలుస్తారు..:

  పోల్చి చూసి తేలుస్తారు..:

  చిన్నారి డీఎన్ఏ రిపోర్ట్ రావడంతో.. మిస్ అయిన చిన్నారుల తల్లిదండ్రుల డీఎన్‌ఏను దీంతో పోల్చి చూడనున్నారు. ఒకవేళ వారిలో ఎవరి డీఎన్ఏతో అయినా చిన్నారి డీఎన్ఏ మ్యాచ్ అయితే కేసులో పురోగతి సాధించే అవకాశముంది. అలాగే ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చిన్నారి ఆడా.. మగా.. అన్నది కూడా తేలిపోనుంది.

  నరబలేనా?:

  నరబలేనా?:


  ఉప్పల్ చిలుకానగర్ లోని క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై 'చిన్నారి తల' దొరికినప్పటి నుంచి కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. నరబలి కోసమే చిన్నారిని చంపేశారన్న ప్రచారం జరిగినప్పటికీ.. దానికి సంబంధించిన ఆధారాలేవి పోలీసులకు చిక్కలేదు. దీంతో చిన్నారి తల అక్కడికెలా వచ్చింది? అన్నది అంతుచిక్కకుండా పోయింది. డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో రాచకొండ పోలీసులు ఈ మిస్టరీని ఒకటి రెండు రోజుల్లో చేధించే అవకాశముంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Uppal police got DNA report of child who murdered in Chilukanagar. Forensic officials are sent the reports on Wednesday night.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి