Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vijay Madduri: ఫామ్ హౌస్ నిందితుడు విజయ్ మద్దూరిపై లకౌట్ నోటీసులు..

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 27న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు పెద్ద ఎత్తున పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి ఫామ్ హౌస్ లో దాడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తు విదేశీ మద్యం, క్యాసినో కు సంబంధించి వస్తువులు ఉన్నాయి.

ఈ పార్టీలో పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు పాల్గొన్నారు. వీరంతా ప్రముఖులే. వారి ప్రవర్తనలో తేడా ఉండడంతో వారికి డ్రగ్స్ పరీక్షలు చేయాలని చేయాలని నిర్ణయించారు. అయితే అక్కడున్న మహిళలు పోలీసులను తిట్టారు. దీంతో వారిని అక్కడి నుంచి పంపించారు. పురుషులకు డ్రగ్స్ టెస్ట్ చేశారు. అయితే విజయ మద్దూరి శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. మూడు గంటల పాటు ఇబ్బంది పెట్టాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి రక్త పరీక్ష చేస్తామని చెప్పడంతో శాంపిల్ ఇచ్చాడు.

Police have issued look out notices against Vijay Madduri

టెస్ట్ లో అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారించారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తనకు డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ ఒప్పుకున్నాడు. విచారణ అనంతరం అతన్ని పంపించేశారు. ఈ కేసులో రాజ్ పాకాలపై కూడా కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత విజయ్ మద్దూరి ఓ వీడియో విడుదల చేశాడు. తను డ్రగ్స్ తీసుకోలేదని.. పోలీసులు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. తను ఓ కంపెనీకి ఓనర్ గా చెప్పుకున్నాడు. రాజ్ పాకాల, తన ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించవద్దని కోరాడు.

ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయాడు. అయితే విజయ మద్దూరుని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తన ఫోన్ కాకుండా మరో మహిళ ఫోన్ ఇచ్చాడు. ఇలా పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతను దేశం విడిచి పోకుండా ఉండేందుకు విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు కేసు నమోదు కాగానే అమెరికా పారిపోయాడు. ఇప్పుడు అక్కడే గ్రీన్ కార్డు తీసుకున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+