విక్రమ్ గౌడ్ భార్య అబద్దం చెప్పారా?: దర్గా వద్ద అలాంటిదేమి కనిపించలేదు!..
తన భర్త విక్రమ్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిందని శుక్రవారం ఉదయం ఆమె ఇచ్చిన ఫిర్యాదులో తప్పుడు సమాచారం ఉన్నట్లుగా పోలీసులు అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మీద జరిగిన కాల్పుల వ్యవహారంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విక్రమ్ గౌడ్ భార్య మూల షిఫాలీ చెబుతున్న సమాచారం మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తన భర్త విక్రమ్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిందని శుక్రవారం ఉదయం ఆమె ఇచ్చిన ఫిర్యాదులో తప్పుడు సమాచారం ఉన్నట్లుగా పోలీసులు అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం దర్గా వద్ద అన్నదానం చేయాల్సి వున్నందున తాము అర్థరాత్రి 2.30 గంటల సమయంలో నిద్ర లేచామని షిఫాలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో దర్గా వద్ద మానవ సంచారమే లేదని పోలీసులు గుర్తించారు.

ఒకవేళ నిజంగా ఆ సమయంలో అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటే, ముందే ప్రచారం జరిగి వుంటుందని, పేదలు చాలామంది అక్కడికి చేరుకునేవారనేది పోలీసుల అభిప్రాయం. అక్కడున్న దర్గా పర్యవేక్షకులు సైతం అన్నదానంపై తమకెలాంటి సమాచారం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ లో ఉన్న దర్గా కాకుండా, మరే చోటనైనా అన్నదాన ఏర్పాట్లు చేశారా? అన్న కోణంలోను పోలీసుల విచారణ కొనసాగుతోంది.
మరోవైపు భార్యతో ముఖేశ్‌కు ఉన్న విభేదాలు.. ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందన్న అనుమానాలను బట్టి చూస్తే.. తొలుత పోలీసులు ఆమెనే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ విభేదాల కారణంగా విక్రమ్ గౌడ్ తనంతట తానుగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications