తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్: 17,099 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, కీలక వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు వచ్చింది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,099 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. భారీ ఎత్తున కానిస్టేబుల్ పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్ఐ, 66 ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

ఎస్ఐ పోస్టుల వివ‌రాలు

ఎస్ఐ పోస్టుల వివ‌రాలు


సివిల్ ఎస్ఐలు -414
ఏఆర్ ఎస్ఐలు -66
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు -05
టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు -23
స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు -12
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -26
జైళ్ల శాఖ -08
ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు -22
పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ - -3
ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు -08

కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు:

కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు:


సివిల్ కానిస్టేబుల్స్ -4965
ఏఆర్ కానిస్టేబుల్స్ - 4423
ఎస్ఏఆర్ సీఎల్ - 100
టీఎస్ఎస్‌పీ - 5010
స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ - 390
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610
జైళ్ల శాఖ(పురుషులు) - 136
జైళ్ల శాఖ(స్త్రీలు )-10
ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+