హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రసాయనాలతో అరటికాయలను మగ్గబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్న అక్రమార్కుల అక్రమాలను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. అరటికాయలు నాలుగైదు రోజుల పాటు నిగనిగలాడుతూ ఉండేందుకు విషతుల్యమైన కార్బన్‌ డైజన్‌తో ఉపయోగిస్తున్నారు.

నగరంలోని పాతబస్తీలో బుధవారం 22 గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఏడింట ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారని తేలడంతో వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. అరటికాయలను మగ్గిస్తున్నారన్న సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని సౌత్ జోన్ డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రసాయనాలతో సహా పళ్లను కూడా ప్రయోగశాలకు పంపిస్తున్నామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వీరు అరటికాయలు తెప్పిస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని చెప్పారు.

రోజుకు వేలాదిగా గెలలు వస్తున్నాయని, వీటిని గోదాముల్లో మగ్గించి వ్యాపారులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి కార్బన్‌ డైజన్‌‌ను మనుషులు ఉపయోగించకూడదని దానిపై ఉన్నప్పటికీ.. అరటికాయలను పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు అత్యంత ప్రమాదకరమైన పద్ధతులను వినియోగిస్తున్నారన్న విషయం ఈ దాడుల్లో తేలింది.

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

కొత్తగా పంటలు వేసేందుకు దాచిన విత్తనాలు బూజు పట్టకుండా వాడే ఫంగిసైడ్‌ను అరటికాయలు మగ్గబెట్టడానికి వ్యాపారాలు వినియోగిస్తున్నారు. అంతేకాకుడా విషతుల్యమైన రసాయనాలతో అరటికాయలపై పిచికారీ చేస్తున్నారు.

 పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

వ్యాపారులు వినియోగిస్తున్న విషపు మందుల సీసాలపై మనుషులు వాడకూడదన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల షాపుల్లో ఇవి సులభంగా దొరుకుతుండడంతో నిందితులు అరటికాయలను మగ్గబెట్టేందుకు ఉపయోగిస్తున్నారు.

 పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

అరటికాయలను పండ్లుగా మార్చేందుకు రెండు, మూడేళ్ల నుంచి రస్‌పాన్‌, ఈపీ-50 రసాయనాలను వినియోగిస్తున్నారు. పాతబస్తీ హైదరాబాద్‌ రైతుబజార్‌, శివార్లలోని అరటికాయల గోదాముల్లో విచ్చలవిడిగా వీటిని వాడుతున్నారు.

 పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

గోదాముల్లో వేలాది గెలలను ఉంచి వాటిపై రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు మూడో రోజుకల్లా అరటికాయులు పండ్లుగా మారతాయి. ఆ తర్వాత వాటిని నాలుగైదు రోజులు తాజాగా ఉంచేందకు గాను ప్రమాదకరమైన కార్బన్‌ డైజిన్‌తో కడుగుతున్నారు.

 పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

పోలీసులు దాడులు: అరటిపండు రంగు వెనుక అసలు నిజం ఇదే?

కార్బన్‌ డైజిన్‌తో కడుగడం వల్ల పండ్లలోకి వెళ్తుందని, అవి తినేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఏసీపీ అశోకచక్రవర్తి తెలిపారు. అల్సర్‌తో పాటు జీర్ణాశయ సమస్యలు, కేన్సర్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయని వివరించారు.

English summary
Police seized calcium carbide used for artificial ripening of fruits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X