అల్లు అర్జున్ బెయిల్ రద్దు - పోలీసుల అనూహ్య నిర్ణయం..!?

సినీ హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్పందించిన అల్లు అర్జున్..ఈ వ్యాఖ్యల పైన మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో, పోలీసులు సైతం వీడియో ల ద్వారా సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని..ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఈ రోజు హైకోర్టులో పిటీషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు.

అల్లు అర్జున్ కామెంట్స్ తో
పుష్ప -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఈ ఘటన పైన అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. సినీ పరిశ్రమ స్పందించిన తీరు గురించి వివరించారు. బాధిత కుటుంబం పరిశ్రమ పెద్దలకు పట్టదా అంటూ ప్రశ్నించారు. సినీ హీరోలకు ప్రత్యేకంగా చట్టం ఉండదని.. స్పెషల్ ఇన్సెంటివ్ కావాలంటే తీసుకోండి కానీ, స్పెషల్ ప్రివిలేజ్ కావాలంటే తాను సీఎం సీట్లో ఉన్నంత వరకు సాధ్యం కాదని రేవంత్ తేల్చి చెప్పారు.

Police to file petition in High court for cancellation of Allu Arjun bail details here

పోలీసుల స్ఫష్టత
ఈ వ్యాఖ్యల పైన అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాదం లో ఎవరి తప్పు లేదని.. తనకు మృతి చెందిన సమాచారం మరుసటి రోజు వరకు తెలియదని చెప్పుకొచ్చారు. దీంతో, స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఘటన జరిగాక ఏ పోలీసు అధికారీ తనతో మాట్లాడ లేదన్న అర్జున్‌ వ్యాఖ్యలపైనా పూర్తి ఆధారాలను సేకరించారు. వీడియోలతో సహా ఏం జరిగిందో వివరించారు. ఇక, అల్లు అర్జున్‌ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్‌ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారని భావిస్తున్నారు. దీంతో, ఆయన బెయిలు ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బెయిల్ రద్దు పిటీషన్
అల్లు అర్జున్‌కు వచ్చే నెల21వరకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ..విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్‌ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న అర్జున్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూ డదని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్‌ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమం లోనే అర్జున్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిలును రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పోలీసుల పిటీషన్.. కోర్టులో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+