కామారెడ్డిలో పొలిటికల్ హీట్.. పబ్లిక్ పల్స్ ఎలా ఉందంటే!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందరి దృష్టి కామారెడ్డి వైపే ప్రధానంగా నెలకొంది. కామారెడ్డి నుండి కెసిఆర్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఒక్కసారిగా అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. ఇక కెసిఆర్ పై పోటీ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించి నామినేషన్ దాఖలు చేయగా ఇక్కడ పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

అదేవిధంగా కామారెడ్డిలో బీజేపీ లీడర్ కత్తిపల్లి వెంకట రమణారెడ్డి కి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉండడంతో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది.తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో,టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అక్కడ రంగంలోకి దిగారు. దీంతో అక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నుంచి బెనారస్ వరకు నాలుగు రైళ్లు నడవనున్నాయి. సెకండ్ క్లాస్ తోపాటు స్లీపర్ బోగీలుంటాయి. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీవరకు ఇవి నడుస్తాయని అధికారులు వెల్లడించారు. నెం. 07005 సికింద్రాబాద్-బనారస్ సికింద్రాబాద్ నుంచి 20వ తేదీ రాత్రి 9.40 గంటలకు బయలుదేరి 22వ తేదీ ఉదయం 6.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. నెం. 07006 బనారస్-సికింద్రాబాద్ రైలు ఉదయం 8.35 గంటలకు బనారస్ లో బయలుదేరి ఈనెల 17, 24 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇవి జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్ పూర్, కట్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్ రాజ్ స్టేషన్లలో ఆగుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉండే దూరాన్ని తక్కువ సమయంలో అధిగమించాలనే ఉద్దేశంతో సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇవి దాదాపు 60 మార్గాల్లో సంచరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి రేణిగుంట మీదగా చెన్నై, కాచిగూడ నుంచి బెంగళూరుకు నడుస్తున్నాయి.

ఇక కామారెడ్డి ప్రజల నాడి విషయానికి వస్తే, కామారెడ్డి ప్రజలు దాదాపుగా సీఎం కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కామారెడ్డి రైతులు మాస్టర్ ప్లాన్ విషయంలో కెసిఆర్ పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. లింగాపూర్, టెక్రియాల్, పాత రాజంపేట, అడ్లుర్, రామేశ్వర పల్లి, అడ్డూర్ ఎల్లారెడ్డి, కామారెడ్డి రైతులు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని చాలామంది రైతులు భావిస్తున్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఇదే సమయంలో కత్తిపల్లి వెంకటరమణారెడ్డి బిజెపి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇమేజ్ ను బాగా పెంచుకున్నారు.

అర్ధబలం బాగా ఉన్న బిజెపి నేత స్థానికంగా తనకు మంచి గుర్తింపు ఉండడంతో, స్థానిక నాయకుడు కావడంతో ప్రజల్లోకి జోరుగా దూసుకు వెళుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు దిగ్గజ నేతలే కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు ఇక్కడ గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గట్టిగానే కామారెడ్డి పై ఫోకస్ పెడుతున్నారు.

ఏది ఏమైనా ఎవరికి వారు ఎన్నికల ప్రచార పర్వాన్ని దూకుడుగా కొనసాగిస్తున్న క్రమంలో కామారెడ్డి ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారు అన్నది రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+