వ్యక్తిగత విమర్శలతో రాజకీయ విలువలు మంటగలుస్తాయి.! ఏపి పరిణామాలపై టీ టీడిపి ఫైర్.!
హైదరాబాద్ : శుక్రవారం ఏపీ శాసనసభలో చోటు చేసకున్న పరిణామాలను తన సుధీర్గ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. ప్రజోపయోగమైన చట్టాలు శాసనసభలో రూపకల్పన చేస్తారని, కానీ వ్యక్తిగత దూషణలు సభలో చోటు చేసుకోవడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ లో జరిగిన సంఘటనలను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని బక్కని తెలిపారు. అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించింది చంద్రబాబు నాయుడుపైన, ఇంటి పనులకే పరిమితమైన ఒక ఇల్లాలుపై అనుచిత వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు బక్కని నర్సింహులు.

కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం.. జగన్ వైఖరి సరిగా లేదంటున్న తెలుగు తమ్ముళ్లు
ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా నిలబడాలని సర్వగీయ ఎన్టీఆర్ తమకు నేర్పారని, చట్ట సభల్లో అనుచిత ప్రవర్తనను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు తెలుగుదేశం తెలంగాణ నేతలు.16 నెలలు జగన్ జైల్లో ఉన్నప్పటికి కనువిప్పు కాకపోవడం విచారకరమని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్, అంబటి రాంబాబు దుర్బాష లాడి రాజకీయాలను కలుషితం చేసారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కూతురు గురించి గౌరవ శాసనసభలో మాట్లాడే బాష నీచంగా ఉందని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా టీడిపి నడుస్తోందని, అరాచకాలు చేయాలంటే ఎంతసేపూ పట్టదని హెచ్చరించారు బక్కని.

కుటుంబ సభ్యులు ఓ పక్క.. పార్టీ శ్రేణులు మరో పక్క.. జగన్ పై సంధిస్తున్న విమర్శనాస్త్రాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హుజూర్నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జైల్లో ఉన్నా జగన్ కు పరివర్తన రాలేదు.. వ్యక్తి దూషణలతో ప్రతిష్ట దిగజారుతుందన్న టీడీపి శ్రేణులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యుల పై వైసీపీ నాయకులు దుర్భాషలాడటం సిగ్గుచేటని టీఎస్ టిడిపి ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ సాగర్ ధ్వజమెత్తారు. వైసిపి పార్టీ నాయకుల ప్రవర్తనపై వారి కుటుంబంలోని ఆడపడుచులే సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు కోడాలి నాని, అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు మీద, వారి కుటుంబం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, చంద్రబాబు నాయుడుని, వారి కుటుంబ సభ్యులను దుర్బుశాలడటం సిగ్గుచేటని టీటీడిపి నేతలు మండిపడ్డారు.

అదికారం శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవాలి.. మందలిస్తున్న తెలుగుదేశం నేతలు..
జగన్మోహన్ రెడ్డి పాలనను తెలుగు రాష్ట్ర ప్రజలందరు అసహ్యహించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తలచుకుంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే వాడా అని ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కుటుంబపై సంస్కారహీనంగా ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు మాట్లాడలేదని అన్నారు. అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు టీటీడిపి నేతలు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications