మీకా దమ్ముందా? కేసీఆర్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్
తెలంగాణ సీఎం కెసిఆర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందించి ఉంటే రానున్న సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ బీఫామ్ లు ఇచ్చే దమ్ముందా అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. డిసిసి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు.

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు మయం చేసి ఉంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ లోని 25 నుండి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలి అనుకుంటున్నారు ఎందుకు అంటూ ప్రశ్నించిన పొంగులేటి వారు అందరూ దొంగలని వారు ప్రజలను ఇబ్బందులపాలు చేసినందుకే మార్చాలని అనుకుంటున్నారు అంటూ ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేయాలని పొంగులేటి పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నవాళ్లు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా అది ఇంకా 55 రోజులు మాత్రమే అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకొని అందరూ పని చెయ్యాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటినుంచి అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ లో ప్రధానంగా సిట్టింగ్ లు అందరికీ బీఫామ్ లు రావని జరుగుతున్న చర్చ నేపధ్యంలో పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications