పొంగులేటి సెన్సేషన్.. బీఆర్ఎస్, బీజేపీలకు టెన్షన్!!

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీల నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ఆ రెండు పార్టీల పునాదులు కదలబోతున్నాయి అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించ తలపెట్టిన రాహుల్ గాంధీ సభ విజయవంతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ సభను విజయవంతం చేసి తీరుతామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సభ కు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ponguletisrinivasreddy

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను సన్మానించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపైన మాట్లాడిన ఆయన రాబోయే రోజుల్లో బిజెపి నుండి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయని, వారి పేర్లు ఇప్పుడే చెప్పలేమని, వారెవరో మీరే చూస్తారు అంటూ ఆయన పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ సభకు జనం రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్లో ఒక వర్గం అసంతృప్తితో ఉన్నారని ప్రచారం చేస్తున్నారని దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు ఉండబోవని అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరగనున్న చేరికలపై చేసిన వ్యాఖ్యలతో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. బిజెపి, బిఆర్ఎస్ ల నుండి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లే నేతలు ఎవరు అన్నది పార్టీలలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+