నీటి కష్టాలకు హరీష్ రావే కారణం: పొన్నం, హెచ్‌సియుపై విహెచ్

హైదరాబాద్: నారాయణఖేడ్‌లో నీటి ఎద్దడికి మంత్రి హరీష్ రావు కారణమని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నాయకుడు పొన్నం ప్రభాకర్ విమర్శిచారు సింగూరు రిజర్వాయర్ నుంచి నీటిని మెదక్‌కు తరలించారని ఆయన బుధవారం మీడియాతో చెప్పారు

నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను దత్తత తీసుకుంటానని హరీష్ రావు ప్రకటించడం ఆ నియోజకవర్గం ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి టీఆర్‌ఎస్‌ తిలోదకాలు ఇచ్చిందని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponnam blames Harish Rao for water shortage

కిష్టారెడ్డి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వం నారాయణ్‌ఖేడ్‌ వైపు చూడలేదన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగూరు జలాలను ఘన్పూర్‌కు తరలించడం వల్లే నారాయణఖేడ్‌లో నీటి సమస్య తీవ్రమైందని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, హెచ్‌సీయూలో ఏబీవీపీ ఆధిపత్యం పెరుగుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. ఏబీవీపీ పూర్వ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డిని హెచ్‌సీయూ బోర్డులో సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే యూనివర్సిటీలో యుద్ధాలు మొదలవుతాయని ఆయన హెచ్చరించారు. నిమ్స్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+