మాజీ ఎంపీ పొన్నం వాహనం బోల్తా: గాయాలు, ఆస్పత్రిలో చేరిక
కరీంనగర్ మాజీ ఎంపీ, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌గౌడ్ ప్రయాణిస్తున్న కారు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొన్నం ప్రభాకర్.
వేములవాడ: కరీంనగర్ మాజీ ఎంపీ, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌గౌడ్ ప్రయాణిస్తున్న కారు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొన్నం ప్రభాకర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో వేములవాడ మండలం నాంపెల్లి గ్రామ శివారు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ మూల మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.

కాగా, ఈ ప్రమాదంలో పొన్నం ప్రభాకర్‌తో పాటు కరీంనగర్ అర్బన్‌బ్యాంకు ఛైర్మన్ రాజశేఖర్, లక్ష్మణ్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.












Click it and Unblock the Notifications