ట్విస్ట్: తల్లిదండ్రులతో మాట్లాడని పూర్ణిమ, తిరుగుప్రయాణం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముంబైలో ఉన్న పూర్ణిమను తల్లిదండ్రులు కలిశారు.అయితే తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పూర్ణిమ ఇష్టపడలేదు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులతో కలిసి హైద్రాబాద్‌కు తిరిగిరావడానికి కూడ ఇష్టపడలేదు. అయితే జువైనల్ కోర్టు ఆదేశం ద్వారా మంగళవారంనాడు సైబరాబాద్ పోలీసులు హైద్రాబాద్‌కు తిరిగిరానున్నారు.

సినిమాల్లో నటించడం ఇష్టమనే కారణంగా పూర్ణిమ ముంబైకి పారిపోయింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, పూర్ణిమ తల్లిదండ్రులతో కలిసి ముంబై వెళ్ళారు. అయితే పూర్ణిమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కూడ ఇష్టపడలేదు.

Poornima did not wants to talk with her parents

వారితో తిరిగి రావడానికి కూడ ఇష్టపడలేదు. పూర్ణిమకు సినిమాల్లో నటించడమంటే ఇష్టమని అందుకే ముంబై చేరుకొందని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే తల్లిదండ్రులతో కూడ మాట్లాడేందుకు పూర్ణిమ ఒప్పుకోలేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే జువైనల్ కోర్టు ఆదేశం మేరకు రోడ్డుమార్గంలో పూర్ణిమను హైద్రాబాద్‌కు తీసుకురానున్నారు. ఈ మేరకు హైద్రాబాద్‌నుండి ప్రత్యేక వాహనంలో మహిళ పోలీసులు ముంబైకి బయలుదేరివెళ్ళారు.

మరోవైపు మాట్లాడేందుకుకూడ ఇష్టపడకపోవడంతో చేసేదిలేక పూర్ణిమ తల్లిదండ్రులు హైద్రాబాద్‌కు బయలుదేరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Poornima did not accept to come with her parents from Mumbai to Hyderabad.She didnot want to talk with her parents.They are retuning from Mumbai to Hyderabad.
Please Wait while comments are loading...