తెలంగాణాలో కరెంట్ కోతలు.. బీఆర్ఎస్ దెబ్బకు జరుగుతున్న చర్చ ఇదే!!
ఎండాకాలం సమీపిస్తుంది . అప్పుడే వాతావరణంలో మార్పులు కూడా వచ్చాయి. ఇక వాతావరణంలో మార్పులతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అడపాదడపా కరెంటు కోతలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడైనా కరెంటు పోతే ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందుకు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కారణంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు కోతలు మొదలవుతాయని ఎన్నికల ముందు నుండి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఇక అవేవీ పట్టించుకోకుండా ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలు ప్రస్తుతం కరెంటు పోతే చాలు ముందు ముందు ఏ విధంగా పరిస్థితి ఉండబోతుందని ఆలోచనలో పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు మొదలవుతాయని ఎన్నికల ముందు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కూడా పవర్ కట్లను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పైన ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇంతకాలం తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా కరెంటుకు ఇబ్బంది పడింది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు వస్తాయా అన్న చర్చ జరుగుతుంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సీతక్క వంటి మంత్రుల సమావేశాలలోనూ కరెంటు కోతలు చోటు చేసుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు తాజాగా హరీష్ రావు మీటింగ్ లో కరెంటు కట్ కావడం తో ఆయన రాష్ట్రంలో మార్పు మొదలైంది అంటూ సెటైర్ వేశారు. కరెంటు గురించి చెబుతున్న సందర్భంలోనే కరెంట్ కట్ కావడాన్ని హరీష్ రావు టార్గెట్ చేశారు.
ఇక కరెంట్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఎక్కడ కరెంటు పోయినా సరే కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు కోతలు ఉంటాయంటూ చర్చించుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో రానున్న ఎండాకాలం ఎలా ఉంటామా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన డైలమా కొనసాగుతుంది.
వచ్చే ఎండాకాలం కరెంట్ కోతలు ఉంటే బిఆర్ఎస్ చెప్పిందే నిజమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. మరి ఈ క్రమంలో కరెంటు కోతల పైన రేవంత్ రెడ్డి సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications