భార్యను చంపిన పోలీస్ కేసు: ప్రదీప్ దొరికినట్లు సమాచారం లేదన్న డీసీపీ
హైదరాబాద్: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీసీపీ కమలహాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన కానిస్టేబుల్ కేసులో పోలీసులు పురోగతి అంటూ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనిపై డీసీపీ కమలహాసన్ రెడ్డి మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడారు. ప్రదీప్ అరెస్ట్ అవాస్తమని ఆయన తెలిపారు. అక్రమ సంబంధం అన్న అనుమానంతోనే భార్య సుప్రియను కానిస్టేబుల్ రామకృష్ణ హత్య చేశాడని వెల్లడించారు. భార్యను హత్య చేసిన రామకృష్ణ, ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకెళ్లి వికారాబాద్ అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ హత్యకేసులో రామకృష్ణకు అతడి స్నేహితుడు ప్రదీప్ సాయం చేసినట్లు పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వాసి రామకృష్ణకు గతేడాది ఆగస్టు 21న అదే జిల్లా వాసి సుప్రియ(19)తో వివాహమైంది.

హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లా వాసి అరుణ్ అనే వ్యక్తిని సుప్రియ ప్రేమిస్తున్నదని పెళ్లైన కొద్దిరోజులకే రామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు. సైకోగా మారిన అతడు గత నెల ఆరున సుప్రియను ఇంట్లోనే టవల్‌తో గొంతు బిగించి హత్య చేశాడు.
ఆ తర్వాత తన స్నేహితుడు ప్రదీప్ సాయంతో సుప్రియ మృతదేహాన్ని పెద్ద సూటుకేసులో పెట్టి, ద్విచక్ర వాహనం పైన వికారాబాద్ అడవికి తీసుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించి పాతిపెట్టాడు. భార్యను దారుణంగా హత్య చేసిన అనంతరం తనకు ఏం తెలియనట్లు... గత నెల 14న రామకృష్ణ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications