• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేబినెట్ భేటీకి కేటీఆర్ డుమ్మా, అందుకే: అసెంబ్లీ రద్దు.. తెలియదు: కేటీఆర్, అందుకు క్షమాపణ

By Srinivas
|
  తెలంగాణ కేబినెట్ భేటీకి కేటిఆర్ గైర్హాజరు

  హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మహేందర్ రెడ్డిలు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నందున సమావేశం నుంచి వారికి మినహాయింపు లభించింది.

  తాను, మరో మంత్రి మహేందర్ రెడ్డి కేబినెట్ భేటీకి హాజరుకావడం లేదని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి మహేందర్ రెడ్డి ఫోన్‌ చేశారని, ప్రగతి నివేదన సభాప్రాంగణం వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం కల్పించాలని కోరారని కేటీఆర్‌ తెలిపారు.

  అందుకే కేబినెట్ భేటీ నుంచి మినహాయింపు

  అందుకే కేబినెట్ భేటీ నుంచి మినహాయింపు

  దీంతో తమకు కేబినెట్ సమావేశం నుంచి మినహాయింపు లభించిందని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ కార్యకర్తలను సమాయత్త పర్చేందుకు ఈ సభ ఉపయోగపడుతుందన్నారు. తమ అంచనాలకు మించి సభ విజయవంతమవుతుందన్నారు.

  పలు అంశాలపై కేటీఆర్

  పలు అంశాలపై కేటీఆర్

  ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభ, ముగ్గురు నలుగురు పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉండటంపై స్పందించారు.

  ప్రభుత్వం రద్దు.. మాకు తెలియదు

  ప్రభుత్వం రద్దు.. మాకు తెలియదు

  ఈ ప్రగతి నివేదన సభ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు మాజీలుగా వెళతారన్న అభిప్రాయముందని, దీనిపై మీరేమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా, కేటీఆర్ స్పందిస్తూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ అలా అనుకోవడం లేదని, అందరూ మళ్లీ మేం గెలిచివస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నారని, ఇక ప్రభుత్వం రద్దు నిర్ణయం అంటారా.. తాను, మహేందర్ రెడ్డి కేబినెట్ భేటీకి వెళ్లడం లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదన్నారు.

  కేటీఆర్ క్షమాపణలు

  కేటీఆర్ క్షమాపణలు

  శనివారం సాయంత్రానికే సభా ప్రాంగణానికి లక్షలాది మంది వచ్చారని, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నుంచి అన్ని వాహనాలు ఇక్కడికే బయలుదేరాయని, నాలుగైదు గంల్లో మిగిలిన సభా ప్రాంగణం నిండిపోతుందని చెప్పారు. ఈ ప్రగతి నివేదన సభ కారణంగా ఇబ్బంది పడిన ప్రజలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
  సంవత్సరం
  అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
  2014
  అసుడుద్దీన్ ఒవైసీ ఎ ఐ ఎం ఐ ఎం విజేతలు 5,13,868 53% 2,02,454
  డాక్టర్ భగవంత్ రావు బీజేపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,11,414 32% 0

  English summary
  The Telangana state cabinet's meeting at the 2,000 acre venue, dubbed as Pragathi Nivedhana Sabha, is being billed to be the largest public meeting in Indian history.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more