వారు రాజకీయ భద్రతా కండోమ్‌లను విక్రయిస్తున్నారా? ఎమ్మెల్యేల కొనుగోళ్ళపై ప్రకాష్ రాజ్ సంచలనం!!
తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం రాజకీయాలలో ప్రకంపనలు రేకెత్తిస్తుంది. బీజేపీ తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిర పరచటం కోసం ఈ తరహా చర్యలకు దిగుతుందని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ అంతా టీఆర్ఎస్ పార్టీ సృష్టి అని, దీనికి కథ స్క్రీన్ ప్లే , దర్శకత్వం అంతా కేసీఆర్ అని బీజేపీ తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తుంది. ఇక ఈ వ్యవహారంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఆ దొంగలకు వేరే పనిలేదన్న ప్రకాష్ రాజ్
ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై సినీనటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలలో బీజేపీ చేసిన పనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు. ఆ దొంగలకు పనిలేదని పేర్కొన్న ప్రకాష్ రాజ్, ఇక్కడ కొత్తగా ఏమీ చేయలేదని, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అన్ని చోట్ల వారు ఇలానే చేస్తున్నారని పేర్కొన్నారు.

వారు రాజకీయ భద్రత కండోమ్‌లను విక్రయిస్తున్నారా?
ఈ విషయాన్ని ప్రజలు అందరూ గుర్తించాలని ప్రకాష్ తెలిపారు. బిజెపినో, మోడీ నో కాదు.. ఎవరు ఇలాంటి పని చేసినా ప్రజలు, మీడియా ప్రశ్నించాలని పేర్కొన్న ప్రకాష్ రాజ్ ఇది తన అభిప్రాయం అన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగానూ ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు యత్నించిన బీజేపీని టార్గెట్ చేసిన ఆయన వారు రాజకీయ భద్రత కండోమ్‌లను విక్రయిస్తున్నారా? అంటూ సంచలన ట్వీట్ చేశారు. సిగ్గులేని బీజేపీ ఎంతగా దిగాజారిపోతుందో అంటూ మరో ట్వీట్ లో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉండాలన్న ప్రకాష్ రాజ్
ఇక ఇలాంటి సమయంలోనే చాలా స్ట్రాంగ్ గా ఉండాలని పేర్కొన్న ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉంటారని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వాన్ని చూస్తే సంతోషంగా ఉంటుందని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలు తనకు ఎంతో ఇష్టమన్నారు. వారు కూడా తనను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. తెలంగాణా ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications