హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ తెలుగు మహా సభలు 2017: కేసీఆర్ హామీలు నెరవేర్చాలి..

By Rajababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

World Telugu Conference 2017 : కేసీఆర్ హామీలు నెరవేర్చాలి

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, శాససభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనాయకుడు కే కేశవరావు, ఎంపీ అసదుద్దీన్‌ఓవైసీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ నెల డిసెంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Prapancha Telugu Mahasabhalu 2017: KCR should fulfil Language Pandits demands

ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన... వరంగల్ జిల్లా నుంచి వచ్చిన ఫరూక్ రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాగత వేడుకలో చెప్పిన విధంగా పది రోజులల్లో భాష పండితుల కష్టాలను నెరవేరుస్తా అంటు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

English summary
Prapancha Telugu Mahasabhalu 2017 grandly started in hyderabad on December 15th. It will be continued to till December 19th. In this occassion, Oneindia.com has taken user feedback from the participants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X