స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక - కేసీఆర్ సూచించారు..!!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీనులయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. స్పీకర్‌కు అభినందిస్తూ సభ్యులు మాట్లాడారు.
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను గౌరవ పూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ కి బాగా తెలుసన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని ఆకాక్షించారు.

పూర్తి విశ్వాసం ఉంది : వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం గడ్డం ప్రసాద్ కృషి ఫలితమేనని చెప్పుకొచ్చారు. అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకు ఆయన చొరవ చూపారని గుర్తు చేసారు.ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన ఆయన కృషి ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. సభలో అందరి హక్కులను వారు కాపడగలరన్న పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత సమస్యలను పరిస్కరించారని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని చెప్పారు.

కేసీఆర్ సూచించారు : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసాద్ కుమార్ ను అభినందించారు. స్పీకర్ గా ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ తమకు సూచించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ సభ్యులు, 39 మంది బీఆర్‌ఎస్ సభ్యులు, ఏడుగురు ఎంఐఎం, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయ్యింది. దీంతో ప్రసాద కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా ప్రసాద కుమార్ బాధ్యతలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications