కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారా?: కీలక ప్రాజెక్టుల సందర్శన, వెంట ప్రకాశ్‌రాజ్ కూడా

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కోసం పనిచేసేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్నవేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశాంత్ కిషోర్ తాజాగా, తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రముఖ నీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. తాజా పరిణామం టీఆర్ఎస్ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుందనడానికి బలం చేకూరుస్తోంది.

తెలంగాణతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్..

తెలంగాణతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్..

జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే పనిలో ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహం.. ఎన్నికలలో అనుసరించాల్సిన విధానంపై ప్రకాశంత్ కిషోర్ నేరుగా పర్యవేక్షించనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం నుంచి తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన మొదలవడం గమనార్హం.

కేసీఆర్ కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్..

కేసీఆర్ కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్..

ప్రశాంత్ కిషోర్ శనివారం ప్రకాష్ రాజ్‌తో కలిసి మల్లన్న సాగర్‌లో పర్యటించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పీకే అండ్ టీం పరిశీలిస్తున్నారు. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలకు పదును పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వే కూడా ఐప్యాక్ బృందం సభ్యులు పూర్తి చేసినట్లు పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. పీకే టీం సీఎం కేసీఆర్‌‌‌కు అవసరమైన సూచనలు చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రకాశ్‌రాజ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ కీలక ప్రాజెక్టుల సందర్శన

ప్రకాశ్‌రాజ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ కీలక ప్రాజెక్టుల సందర్శన

కాగా, తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు పీకే కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్‌ను సందర్శించారు. దీంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పీకే నేరుగా ఫీల్డ్‌కు వెళ్లి తెలుసుకున్నట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు మార్చి 10న ముగిసిన వెంటనే గోవాలో ఉన్న పీకే ఫుల్ టీం తెలంగాణలో దిగబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయినట్టు తెలిసింది. పీకే టీం నుంచి రిషి తెలంగాణ బాధ్యతలు వహించబోతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ పీకేతో సహా టీంలోని ముఖ్యులతో భేటీ అయినట్టు తెలిసింది.

తెలంగాణలోనూ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తారా?

తెలంగాణలోనూ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తారా?

ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయాల్లో వ్యూహాలు రచించి.. పలువురు ముఖ్యమంత్రులు కావడంలో కీలకంగా వ్యవహరించారు. 2015లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 2017లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమహేందర్ సింగ్ , 2019లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2021లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం పూర్తి స్థాయిలో పని చేసి ఆయా పార్టీల విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పుడు, ఒవైపు, బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నుంచి కొంతమేర సవాళ్లు ఎదురవుతున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం పీకే టీఎం పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+