కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ 8 గంటలపాటు సుదీర్ఘ భేటీ: జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రవేశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల కోసం పనిచేసి ఎన్నికల్లో వారి గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ భేటీ కావడం గమనార్హం.

కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రశాంత్ కిషోర్ భేటీ..
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ ఆదివారం ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. వీరి భేటీని టీఆర్ఎస్ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా, దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్న పీకే బృందం తెలంగాణలోనూ సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది.

ప్రకాశ్ రాజ్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రాజెక్టుల సందర్శన
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయనతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. శనివారం ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చారు. అప్పటికే ప్రకాశ్‌రాజ్‌తో సీఎం సమావేశమై ఆయనను గజ్వేల్, మల్లన్నసాగర్, పోచమ్మసాగర్ పర్యటనకు పంపించారు. పీకేను కూడా నీటి ప్రాజెక్టులను సందర్శించాలని సూచించారు. దీంతో ప్రకాశ్ రాజ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రాజెక్టులను సందర్శించారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల కాలనీలకు వెళ్లి వారితో మాట్లాడారు.

కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ
కాగా, కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ సుమారు 8గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ యేతర జాతీయ రాజకీయ వేదికతోపాటు ఇటీవల ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ చర్చల విషయం, తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై తమ టీం సర్వేను కూడా పీకే వెల్లడించినట్లు సమాచారం. అంతేగాక, తెలంగాణలో సర్వేపై కూడా చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగిన సూచనలు సీఎం కోరినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో త్వరలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సదస్సు గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ఇప్పట్నుంచే మరోసారి పార్టీ గెలుపుకోసం బాటలు వేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications