హైదరాబాద్ ‘ప్రతిమ’లో కరీనాకు వైద్య పరీక్షలు(పిక్చర్స్)
హైదరాబాద్: బాలీవుడ్ నటులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ శనివారం నగరంలో సందడి చేశారు. ప్రతిమ ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కాగా, ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

కరీనా, సైఫ్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థ ప్రతిమ హాస్పిటల్స్.. వరంగల్‌లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో వరంగల్‌లోని ములుగు రోడ్డులో ఏర్పాటు చేయబోతున్న ఈ ఇన్‌స్టిట్యూట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్లు ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిణి బోయినపల్లి తెలిపారు.

ప్రతిమలో కరీనా దంపతులు
హైదరాబాద్‌లోని కాచిగూడ వద్ద ఏర్పాటుచేసిన ఆస్పత్రికి బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ శనివారం ప్రారంభించారు. కరీనా కపూర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

కరీనా కపూర్
అనంతరం హరిణి మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు, కరీంనగర్‌లో ఒక హాస్పిటల్ ఏర్పాటుకు రూ.200 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ మూడు దవాఖానలు 1,500 పడకల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

ప్రతిమ ఆస్పత్రి
వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఐదేండ్లలో ప్రతి జిల్లా కేంద్రంలో 50 నుంచి 100 పడకల సామర్థ్యంతో హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ఇందుకోసం సంస్థ రూ.350 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

సైఫ్ అభివాదం
ప్రతిమ హాస్పిటల్స్ ప్రచారకర్తలుగా బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ..సామాన్యుడికి సైతం తక్కువ ఖర్చుకే ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతిమ ముందుకురావడం హర్షణీయమన్నారు.

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్
ఇకనుంచి ఏర్పాటుచేయబోయే ఆస్పత్రుల్లో డాక్టర్లను కూడా భాగస్వామ్యులుగా చేయనున్నట్లు తెలిపారు. కాచిగూడ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు 30% వాటా కల్పించామన్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH!












Click it and Unblock the Notifications