హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఇంటికి ప్రత్యూష: సిఎంతో కలిసి భోజనం, సిఎం భార్య పరామర్శ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి ప్రత్యూష భోజనం చేశారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టు నుంచి ప్రత్యూషను నేరుగా ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి తీసుకు వచ్చారు.

ఆమెను కెసిఆర్ ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కెసిఆర్, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యూష భోజనం చేశారు.

సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష బాలల హక్కుల సంఘం వారు కొద్ది రోజుల క్రితం కాపాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె సంరక్షణకు నారా లోకేష్, పోసాని కృష్ణమురళి, సిఎం కెసిఆర్ తదితరులు ముందుకు వచ్చారు.

ముఖ్యమంత్రి కెసిఆర్, కూతురు, ఎంపీ కవిత తదితరులు ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించారు. మరోవైపు, ప్రత్యూష అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది.

ఆమెను కోర్టులో హాజరుపర్చాలని సూచించింది. ఆమె సంరక్షణ బాధ్యతలు తీసుకునే వారు ఉంటే రావొచ్చునని సూచించింది. బుధవారం నాడు ప్రత్యూష హైకోర్టుకు హాజరయ్యారు. ఆమెతో జడ్జి 25 నిమిషాలు మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం, ప్రత్యూషను ముఖ్యమంత్రి ఇంటికి తీసుకు వెళ్లాలని జడ్జి ఎల్బీ నగర్ పోలీసులకు సూచించారు. కెసిఆర్ ఏం చేస్తారో వేచిచూద్దామన్నారు. ప్రత్యూష సంరక్షణ బాధ్యత తీసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రిని అభినందించారు.

కెసిఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

కెసిఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి ప్రత్యూష బుధవారం నాడు క్యాంప్ కార్యాలయంలో భోజనం చేశారు.

 కెసిఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

కెసిఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యూషను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి తీసుకు వెళ్లారు.

కెసిఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

కెసిఆర్‌తో కలిసి ప్రత్యూష భోజనం

ప్రత్యూషను పరామర్శించిన కెసిఆర్, అనంతరం ఆమెతో కలిసి భోజనం చేశారు. కెసిఆర్ సతీమణి శోభ ఆమెను క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నారు.

 ప్రత్యూష

ప్రత్యూష

సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష బాలల హక్కుల సంఘం వారు కొద్ది రోజుల క్రితం కాపాడిన విషయం తెలిసిందే.

ప్రత్యూషను సిఎం ఇంటికి తీసుకెళ్లండి: కెసిఆర్‌కు జడ్జి కితాబు

ప్రత్యూషను ముఖ్యమంత్రి ఇంటికి తీసుకు వెళ్లాలని జడ్జి ఎల్బీ నగర్ పోలీసులకు సూచించారు. కెసిఆర్ ఏం చేస్తారో వేచిచూద్దామన్నారు. ప్రత్యూష సంరక్షణ బాధ్యత తీసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రిని అభినందించారు.

English summary
Prathyusha takes meal with Chief Minister KCR at CM camp office on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X