నటి ప్రత్యూష కేసులో సంచలన ట్విస్ట్.. 24 ఏళ్ల తర్వాత..
నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ మేరకు సిద్ధార్థ రెడ్డిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16 వ తేదీలోగా లొంగిపోవాలని గత నె ఆదేశాలు జారీ చేసింది. దాంతో దాదాపు 24 ఏళ్ల తర్వాత నిందితుడు అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇక ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్థారించిన విషయం తెలిసిందే.
నటి ప్రత్యూష మృతి కేసు అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీ కోర్టు ఆదేశాల మేరకు 24 ఏళ్ల తర్వాత ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. మార్చి 16 లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. ఆ గడువు ఇవాల్టితో ముగియనున్న నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు సిద్ధార్థరెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ కేసులో భాగంగా దాదాపు 24 ఏళ్ల తర్వాత సిద్ధార్థ రెడ్డి మీడియా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక 2002 ఫిబ్రవరి 23వ తేదీన కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ తాగారు. అయితే ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యూష పరిస్థితి విషమించి మృతిచెందింది. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. అయితే.. అప్పటినుంచి తన కూతురిది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ తల్లి న్యాయపోరాటం చేసింది. సిద్ధార్థ రెడ్డే కారణమంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చింది. ఇక ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్థారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications