• search

అసెంబ్లీకే కాదు లోక్‌సభకూ ముందస్తే.. కేంద్రం బాటలోనే సీఎం కేసీఆర్ ?

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది! కేంద్రంలోని మోదీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తోందన్న సమాచారంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గులాబీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నవంబర్‌లోనే అసెంబ్లీ, పార్లమెంట్ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఇంతకుముందు ఈ ఏడాది చివరిలోగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన సీఎం కేసీఆర్.. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలను సజావుగా ఎదుర్కోవచ్చునని భావించారు.

  అందుకే ఏ క్షణంలో అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకైనా సిద్ధమేనని పార్టీ శ్రేణులకు, తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలకు ప్రత్యేకించి తనను ఢీకొట్టాలని భావిస్తున్న విపక్షాలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు నేపథ్యంలోనూ, ఇంతకుముందు ప్రతిపాదించిన మేరకు ముందస్తుగా ఎన్నికల నిర్వహణకే సిద్ధమవుతున్నది.

   Telangana CM KCR Strategy for 2019 elections - Oneindia Telugu

   ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ముగియనున్న కాల పరిమితివచ్చే ఏడాది జూన్ లోగా ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలుఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు కాల పరిమితి ముగియనున్నది. ఎనిమిది రాష్ట్రాలకు వచ్చే ఏడాది జూన్ లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ క్రమంలో మే నెలాఖరులోగా మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు యధాతథంగానే జరుగుతాయి. మిగతా ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాలకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు ఈ ఏడాది నవంబర్ లోపే ప్రజాతీర్పుకోసం ముందుకెళ్లాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపితే తెలంగాణ కూడా అదే బాటలో పయనించక తప్పదు.

   వచ్చే ఏడాది జూన్ లోగా ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

   వచ్చే ఏడాది జూన్ లోగా ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

   ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు కాల పరిమితి ముగియనున్నది. ఎనిమిది రాష్ట్రాలకు వచ్చే ఏడాది జూన్ లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ క్రమంలో మే నెలాఖరులోగా మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు యధాతథంగానే జరుగుతాయి. మిగతా ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాలకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు ఈ ఏడాది నవంబర్ లోపే ప్రజాతీర్పుకోసం ముందుకెళ్లాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపితే తెలంగాణ కూడా అదే బాటలో పయనించక తప్పదు.

    నవంబర్ లోనే ఎన్నికలన్న స్పృహతోనే ఉండాలని సంకేతాలు

   నవంబర్ లోనే ఎన్నికలన్న స్పృహతోనే ఉండాలని సంకేతాలు

   ‘ఈ ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే అనివార్యంగా మనమూ వెళ్లక తప్పదు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టండి. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొందాం. వివిధ సర్వేల్లో మనకు అంతా అనుకూలంగానే ఫలితం వస్తోంది. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఈ లోగా సర్దుకుందాం. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్న స్పృహతోనే ఉండాలి. అంతా అప్రమత్తంగా పనిచేయాలి' అని సీఎం కేసీఆర్‌ నేతలకు చెబుతున్నట్లు టీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

    అవసరమైన ప్రాంతాల్లో ‘టీఆర్ఎస్' మరమ్మతు

   అవసరమైన ప్రాంతాల్లో ‘టీఆర్ఎస్' మరమ్మతు

   రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, కులాలు, వర్గాల వారీగా ప్రకటిస్తున్న వరాలు, పార్టీలోకి జరుగుతున్న చేరికలు వంటి అంశాలన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలను చూపుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, రాజకీయ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్‌.. అవసరమైన చోట మరమ్మతులు చేస్తున్నారని అంటున్నారు.

    2019 జూన్ రెండో తేదీతో అసెంబ్లీ గడువు

   2019 జూన్ రెండో తేదీతో అసెంబ్లీ గడువు

   ఇందులో భాగంగానే ఆయా అసెంబ్లీ స్థానాల వారీగా వివిధ పార్టీల నుంచి ముఖ్యమైన వారని అనుకున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ వేగం పుంజుకున్నదని, ఇదంతా ముందస్తు కసరత్తులో భాగమేనని చెబుతున్నారు. ఈ నెల 15న అసెంబ్లీ స్థానాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆ రోజు బీజేపీ తన వైఖరిని ఖరారు చేస్తుందన్న సమాచారం ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జూన్‌ 2వ తేదీతో శాసన సభ కాల పరిమితి పూర్తవుతోంది.

   జనవరిలోపు మూడు రాష్ట్రాలకు పోల్స్ నిర్వహణ

   జనవరిలోపు మూడు రాష్ట్రాలకు పోల్స్ నిర్వహణ

   దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఐదు, వచ్చే ఏడాది జూన్‌ కల్లా ఎనిమిది రాష్ట్రాలు కలుపుకుని మొత్తంగా 13 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌సభ కాల పరిమితి కూడా వచ్చే ఏడాది జూన్‌ 3తో ముగియనుండటంతో ఏప్రిల్‌ - మే మధ్య ఎన్నికలు జరపాలి. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటకలకు ఈ ఏడాది మేలో నిర్ణీత గడువులోగానే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మిజోరాంలో ఈ ఏడాది నవంబర్‌లోగా ఎన్నికలు జరగాలి. వచ్చే ఏడాది జనవరిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. వీటికి ఈ ఏడాది డిసెంబర్ ‌- వచ్చే ఏడాది జనవరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వీటి ఎన్నికలను ముందుకు జరిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    టీఆర్ఎస్ కీలక నేతలకు సీఎం కేసీఆర్ సంకేతాలు

   టీఆర్ఎస్ కీలక నేతలకు సీఎం కేసీఆర్ సంకేతాలు

   మరోవైపు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ - మే నెలల మధ్య, తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వచ్చే ఏడాది మే - జూన్‌ మధ్య ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఎనిమిది రాష్ట్రాలకు ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్‌ 3తో కాలపరిమితి ముగియనున్నందున లోక్‌సభకు కూడా ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రాలు కూడా ఎన్నికలకు వెళ్లడం అనివార్యం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. లోక్‌సభతోపాటే శాసనసభ ఎన్నికలకు వెళ్లక తప్పదని టీఆర్‌ఎస్‌ అధినేత ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వద్ద ఈ అంశాన్ని ఇటీవల ప్రస్తావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

   English summary
   Telangana CM Kalwakuntla Chandra Shekhar Rao told his associate, TRS important leaders that pre polls for Loksabha and Assembly before November in this year. In Centre BJP also thinking to go pre polls.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more