ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారును లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ఇంకొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఇక అత్యంత విషాదం నింపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్తున్న వారు ప్రమాదంలో అనంత లోకాలకు

ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్తున్న వారు ప్రమాదంలో అనంత లోకాలకు

ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం హనుమకొండ కమలాపూర్ కు చెందిన అరవింద్ , వరంగల్ కు చెందిన రాము, కళ్యాణ్, శివ, నర్సంపేటకు చెందిన రణధీర్ కారులో బయలుదేరారు. భద్రాద్రి జిల్లా మోతే ప్రాంతానికి వెళ్లి ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించటానికి వీరంతా వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన వస్తువులతో కారులో బయలుదేరారు. టీఎస్ 03 ఎఫ్సి 9075 నెంబర్ గల వీరి కారు మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లందు వైపు వెళుతున్న క్రమంలో, ఇల్లందు నుండి మహబూబాబాద్ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

కారును డీ కొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

కారును డీ కొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

దీంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. నలుగురు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు లారీ వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు ముందు భాగమంతా నుజ్జు నుజ్జయింది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు కబురు పంపించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

లారీలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారా? లేక పోలీసుల అదుపులోకి తీసుకున్నారా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. లారీ డ్రైవర్ తాగి బండి నడిపాడా? లేక నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయడానికి వెళ్లిన ఐదుగురు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వరంగల్ జిల్లాలో విషాదం మిగిల్చింది. వేగంగా వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు, ఆర్టిఏ అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్న వాహన చోదకుల నిర్లక్ష్యం అనేక కుటుంబాలలో విషాదం నింపుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+