ఇది ముమ్మాటికీ హత్యే: బండి సంజయ్; ప్రీతి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: బీజేపీ కీలకనేతలు!!
మెడికో ప్రీతి మృతి ముమ్మాటికీ హత్యే అని బండి సంజయ్ పేర్కొనగా, ప్రీతి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ డీకే అరుణ, ఈటల రాజేందర్, ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఐదు రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్లాడి చివరికి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచింది. ఇక ప్రీతి మరణంతో రాష్ట్రంలో ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలైందని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రీతి మృతిపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరికి వారు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇది ముమ్మాటికీ హత్యే: బండి సంజయ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డాక్టర్ ప్రీతి మృతి పై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. డా.ప్రీతి మరణం అత్యంత బాధాకరం అని పేర్కొన్న ఆయన తన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎంతో భవిష్యత్ ఉన్న తను చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ హత్యేనని.. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం జరిగిందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ర్యాగింగ్ ను నియంత్రించలేని కేసీఆర్ ప్రభుత్వం ఈ మృతికి బాధ్యత: డీకే అరుణ
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదైన శైలిలో స్పందించారు. ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం చేసిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందటం బాధాకరమని, ఆమె సీనియర్ విద్యార్థి తనను వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసినా, పట్టించుకోని కేఎంసీ ప్రిన్సిపాల్ , హెచ్వోడి, స్థానిక పోలీసులు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను నియంత్రించలేని కేసీఆర్ ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన ప్రీతి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యను కొనసాగిస్తూ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఇలా నిష్క్రమించడం చాలా విషాదకరమని పేర్కొన్నారు.

హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్
ప్రీతి పై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ ఈ రోజు తన చావుకు కారణమైన సైఫ్ పై వెంటనే హత్యా నేరం కేసు నమోదు చేయాలని, అలాగే ప్రీతి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన మొబైల్ ఉపయోగించి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మొత్తం ఉదంతం పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ప్రీతి లాంటి విద్యార్థులు అర్ధాంతరంగా తమ జీవితాలు ముగించకుండా కాపాడవలసిన అవసరం ఉందని డీకే అరుణ పేర్కొన్నారు.

ప్రీతి మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి: ఈటల రాజేందర్
ఇక బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రీతి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ ప్రీతి మరణం చాలా బాధాకరం, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్న ఆయన, వారికి ధైర్యం అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రీతి మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.

బాధితురాలు హిందువు అనే చర్యలు లేవా? విష్ణు వర్ధన్ రెడ్డి
ప్రీతి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బాధితురాలు హిందువు కాబట్టి, ప్రీతి లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఆయన తెలంగాణ పోలీసులను విమర్శించారు. వారు సైఫ్ ను విడిచిపెట్టారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలలో బిజీబిజీగా ఉంటే యువతి ఏడుపు ఏ విధంగా వినిపిస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రీతికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications