కెసిఆర్ కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేయించిన బాబు, స్వయంగా స్వాగతం
మెదక్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్న భోజనం (లంచ్) చేయనున్నారు. తాను నిర్వహించనున్న ఆయత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ విజయవాడకు వెళ్తున్నారు.
ఈ రోజు ఉయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బెజవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో చంద్రబాబు క్యాంప్ కార్యాలయం చేరుకొని, ఆయనను ఆహ్వానిస్తారు. అనంతరం ఇద్దరు కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆయన బెజవాడ కనకదుర్గమమ్ము కూడా దర్శించుకునే అవకాశముంది.
మరోవైపు, చండీ యాగానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
కెసిఆర్ కోసం చంద్రబాబు మెనూ..
తెలంగాణ సీఎం కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం అమరావతికి బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానించనున్నారు. కెసిఆర్ కోసం చంద్రబాబు 15 రకాల వంటకాలతో కూడిన మెనూను సిద్ధం చేయించారు. తన ఇంటికి సమీపంలోని హెలిపాడ్‌లో దిగే కేసీఆర్‌కు చంద్రబాబు స్వయంగా స్వాగతం పలుకుతారు. ఇరువురు కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత యాగానికి కెసిఆర్ ఆహ్వాన పత్రికను అందిస్తారు.
కేసీఆర్ కోసం... తెలుగింటి రుచులను సిద్ధం చేయించారు. గోంగూర, ఉలవచారు, నాటుకోడి పులుసు, టమోటా పప్పు, మజ్జిగ పులుసు, మునక్కాయ సాంబారు, బిరియానీ, గడ్డ పెరుగులతో పాటు పూతరేకులు, కాజాలు వంటి స్వీట్స్, వివిధ రకాల పండ్ల ముక్కలు తదితరాలను సిద్ధం చేశారని సమాచారం. కెసిఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ వెళ్లారు.

చండీయాగం
మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

చండీయాగం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్ర సమీపంలో చేపడుతున్న యాగం పనులను ఆదివారం ఆయన పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.

చండీయాగం
ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రంలో పంటలను పరిశీలించిన ఆయన సాయంత్రం కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ సుమతి, జేసీ వెంకట్రామ్ రెడ్డి, ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అరగంట యాగ స్థలంలో తిరుగుతూ సూచనలు చేశారు.

చండీయాగం
ఈ నెల 23 నుంచి అయత చండీయాగం ప్రారంభం కానుంది. ఆధ్యాత్మికశోభ వెల్లివిరిసేలా యాగస్థంలో భారీ సెట్టింగులతో తాత్కాలిక నిర్మాణాల పనులు చేస్తున్నారు. యాగ స్థలంలో 1500 మంది వేద బ్రాహ్మణులు ఉండటానికి రెండు తాత్కాలిక షెడ్లను నిర్మిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు.

చండీయాగం
300 బయో టాయిలెట్లు నిర్మిస్తున్నారు. వీవీఐపీల కోసం రెండు ప్రత్యేక కుటీరాలు ఏర్పాటు చేస్తున్నారు. శృంగేరి పీఠాధిపతుల కోసం మరో మూడు కుటీరాలను నిర్మించారు. వీఐపీల కోసం రెండు షెడ్లను ఏర్పాటు చేశారు.
101 యజ్ఞ గుండాలను నిర్మిస్తున్నారు.

చండీయాగం
భారీ సెట్టింగ్‌లతో యాగ స్థలం నిర్మిస్తున్నారు. యాగస్థలం చుట్టూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పలు సెట్టింగులు వేస్తున్నారు. అధికారులు సమావేశాలను నిర్వహించుకునేందుకు ఏసీ రూం సిద్ధం చేశారు. స్వాగత తోరణాలు సిద్ధం చేస్తూ వాటికి అందంగా రంగులు అద్దుతున్నారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ముగ్గులు వేస్తున్నారు.

చండీయాగం
యాగ స్థలంలో ప్రత్యేక ఆకర్షణ కోసం 10 కృత్రిమ యజ్ఞపీఠాలను తయారు చేసి యజ్ఞకుండలి నుంచి నిరంతరం జ్వాలలు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. యాగ స్థలం ముందు పోలీస్ కంట్రోల్ రూం నిర్మిస్తున్నారు. పోలీస్ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను ఇక్కడినుంచి అధికారులు పర్యవేక్షించనున్నారు.

చండీయాగం
చండీయాగానికి వచ్చే వారికి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని కెసిఆర్ సూచించారు. యాగాన్ని ప్రముఖులు, ప్రజలు చూసేందుకు అనుకూలంగా ఉండాలన్నారు.

చండీయాగం
ముఖ్యంగా భద్రత అధికారులకు కెసిఆర్ పలు సూచనలు చేశారు. ఏఏ స్థలంలో ఎవరు ఉండాలనే అంశాన్ని అరగంట పాటు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications