ప్రపంచ తెలుగు మహాసభలో బాలకృష్ణ సవాల్, తెలంగాణకు రెండూ తెలుసు
Recommended Video

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఓ సవాల్ చేశారు. మూడు నిమిషాలు ఒక్క పరాయిపదం లేకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఉన్నారా అని అడిగారు.
ఎల్బీ స్టేడియంలో సోమవారం రాత్రి తెలుగు మహాసభలకు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పై సవాల్ చేశారు. తెలుగు భాషలలోని యాసల గురించి ప్రస్తావించారు.

ఇదీ తెలుగు భాష
కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులు ఉన్నాయని, తెలంగాణ మాగాణం తెలుగు భాష అని, రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉంటుందని బాలకృష్ణ అన్నారు. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలన్నారు.

తెలంగాణ భూమ్మీద పుట్టిన వారికి రెండూ తెలుసు
ఎన్టీఆర్ పేరు వింటే రక్తం ఉప్పొంగుతుందని, తెలుగు పదం వింటే తనువు పులకిస్తుందని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ను అన్న అని పిలచుకునే అభిమానం మారలేదని ఆయన అన్నారు. తెలంగాణ భూమ్మీద పుట్టిన వారికి అభిమానించడమే కాదు ఎదిరించడమూ తెలుసునని వ్యాఖ్యానించారు.

అది విప్లవాత్మకం
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు భాషకు గుర్తింపు తీసుకు రావాలనే సంకల్పంతో తలపెట్టిన మహాసభల స్ఫూర్తి ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకం అన్నారు.

సత్కరించిన కేటీఆర్
ఈ సభలో మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్, నాగార్జున, వెంకటేష్, ఆర్ నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, దర్శకులు ఎన్ శంకర్, నరసింగరావు మాట్లాడారు. నటులు, దర్శకులు, నిర్మాతలను గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ సత్కరించారు. కాగా, ప్రపంచ తెలుగు మహాసభల ముగింపుకు రాష్ట్రపతి కోవింద్ రానున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications