బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మునుగోడు ఉపఎన్నిక; స్పీడందుకున్న రాజకీయం; కోమటిరెడ్డికి కత్తిమీద సామే!!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలని కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దూకుడు మీద ఉన్న బిజెపి ఉప ఎన్నికకు రెడీ అవుతోంది. మునుగోడు నియోజకవర్గాన్ని సైతం తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఇక ఈ ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.

బీజేపీకి కలిసొస్తున్న ఉపఎన్నికలు.. మునుగోడులోనూ వ్యూహాత్మక అడుగులు

బీజేపీకి కలిసొస్తున్న ఉపఎన్నికలు.. మునుగోడులోనూ వ్యూహాత్మక అడుగులు

ఇటీవల కాలంలో బీజేపీకి ఉప ఎన్నికలు బాగా కలిసి వస్తున్నాయి. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినా ఆ స్థానం బిజెపి ఖాతాలోనే పడటం బిజెపికి లాభం చేకూరుస్తుంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు ప్రజలు పట్టం కట్టారు. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికలోనూ ఈటల రాజేందర్ విజయం సాధించడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మైలేజీ అమాంతంగా పెరిగింది. ఇక ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇది కూడా తమ ఖాతాలోనే పడాలని బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

బీజేపీలో చేర్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేయడానికి ఢిల్లీ బాట

బీజేపీలో చేర్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేయడానికి ఢిల్లీ బాట

ఇక తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఆయనను బీజేపీలో చేర్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేయడానికి బిజెపి ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా తో సహా బిజెపి అగ్ర నేతలను కలవనున్న బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు హైకమాండ్ నుండి అనుమతి తీసుకోనున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే తేదీని ఢిల్లీ పెద్దలు ఖరారు చేయనున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం.

మునుగోడు ఉప ఎన్నికపై అమిత్ షా ఫోకస్

మునుగోడు ఉప ఎన్నికపై అమిత్ షా ఫోకస్

ఇక ఇదే సమయంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో చేరికలను లక్ష్యంగా చేసుకుని బిజెపి దూకుడుగా ముందుకు వెళ్తున్న వేళ వివిధ జిల్లాల్లో చేరికలపై కూడా బిజెపి అధినాయకత్వంతో రాష్ట్ర నేతలు మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మేరకు అమిత్ షా కూడా బీజేపీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

రాజగోపాల్ రెడ్డికి కత్తి మీద సాముగా మునుగోడు ఉపఎన్నిక

రాజగోపాల్ రెడ్డికి కత్తి మీద సాముగా మునుగోడు ఉపఎన్నిక

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన చేరికతోనే ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. తన సత్తా చాటేలా భారీ చేరికలతో బీజేపీ అధిష్టానాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార టీఆర్ఎస్ ను, కాంగ్రెస్ బలాన్ని తగ్గించి మళ్ళీ గెలవటం ఆయనకు కత్తిమీద సామే అన్నట్టు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మునుగోడుపై రాజకీయాలపై పట్టు ఉంటుంది. లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతుంది. అందుకే చావో రేవో తేల్చుకోవటానికి రాజగోపాల్ రెడ్డి రెడీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+