పూజలు చేస్తే మంత్రి పదవి: ఎమ్మెల్యేకు రూ.57 లక్షల బురిడీ, ఎమ్మెల్యేగా అయ్యేందుకు కూతురు

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురయింది. తాము పూజలు చేస్తే మీకు మంత్రి పదవి వస్తుందని కోయ దొరలు చెప్పారు. అది నమ్మి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు.

కానీ వారు రూ.57 లక్షల డబ్బు తీసుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని బురిడీ కొట్టించారు. తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి పదవి కోసం పూజలు చేయలేదని, ఆరోగ్యం కోసం చేసినట్లు వారు చెబుతున్నారు.

Priests dupe MLA of Rs 57 lakh promising minister post

పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు పెట్టారు. మాయమాటలు చెప్పి డబ్బు వసూలు చేసిన కోయ దొరలు లక్ష్మణ రాజు, వంశీరాజులపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, మంత్రి పదవి కోసం పూజలు చేయించానని చెబితే బావుండదని, కూతురుతో ఆరోగ్యం పేరిట పూజలు చేయించినట్లుగా ఫిర్యాదు చేయించారని తెలుస్తోంది.

అంతేకాదు, తన తండ్రికి మంత్రి పదవి, తనకు ఎమ్మెల్యే పదవి కావాలని ఆ కూతురు పూజలు చేయించినట్లుగా కూడా చెబుతున్నారు.

ఎమ్మెల్యే స్పందన

తాము మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. తన ఆరోగ్యం కోసమే తన కూతురు కోయ దొరలతోపూజలు చేయించుకుందని చెప్పారు.

విషయం తెలియగానే తన కూతురుతో పోలీసు కేసు పెట్టించానని చెప్పారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో వారితో పూజలు చేయించారని, ఈ విషయాన్ని వారే పోలీసుల వద్ద చెప్పారని, కోయ దొరల వద్ద విఐపీలతో దిగిన ఫోటోలు ఉన్నాయని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A ruling party legislator and his relatives fell victim to two tribal priests who promised to "turn around the sagging political fortunes" of the leader by conducting pooja. Over a period of time, they duped the legislator of nearly Rs 57 lakh.
Please Wait while comments are loading...