కోడ్‌బాషలోనే డ్రగ్స్ సరఫరా, కెల్విన్ ఫోన్‌లో సీక్రెట్ ఫోల్డర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో ప్రముఖులతోపాటు హైద్రాద్‌లోని పలు స్కూళ్లకు డ్రగ్స్ సరఫరాచేసిన కెల్విన్ వాట్సాప్‌లో కోడ్ బాషను ఉపయోగించేవాడని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సినీ ప్రముఖులతో ఛాటింగ్ చేసే సమయంలో ఆయన కోడ్ భాషనే ఉపయోగించినట్టు పోలీసుల విచారణలో కెల్విన్ తెలిపినట్టు సమాచారం.కెల్విన్ ఫోన్‌లో సీక్రెట్ ఫోల్డర్‌ను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైద్రాబాద్‌లోని స్కూళ్లు, సినీ రంగానికి చెందిన ప్రముఖులను ప్రస్తుతం ఈ డ్రగ్స్ భూతం వెంటాడుతోంది. ప్రముఖులనను డ్రగ్స్ సరఫరాచేసినట్టుగా కెల్విన్ పోలీసుల విచారణలో వెల్లడించారు.

మంత్రులు, తెరాస వాళ్లున్నా వదలొద్దు: డ్రగ్స్ కేసుపై కేసీఆర్, లిస్ట్ ఇచ్చిన అకున్

అయితే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కస్టడీకి తీసుకొన్న పోలీసులు కెల్విన్ నుండి సమాచారాన్ని సేకరించారు.

అసలు కెల్విన్ సినీ ప్రముఖులను ఎలా పరిచయం పెంచుకొన్నాడు, వారికి డ్రగ్స్ ఎలా సరఫరాచేసేవారు తదితర అంశాలపై కెల్విన్ నుండి సమాచారాన్ని రాబాట్టారని తెలుస్తోంది.

కోడ్ బాషను ఉపయోగించే కెల్విన్

కోడ్ బాషను ఉపయోగించే కెల్విన్

సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాచేసేందుకు కోడ్ బాషను కెల్విన్ ఉపయోగించేవాడని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ను 'పేపర్' పేరుతో సంబోధించేవాడు. వాట్సాప్, లేదా ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా చాటింగ్‌లలో ఈ రకంగా కోడ్ బాషను ఉపయోగించేవారని పోలీసులు గుర్తించారు. బోయ్ అంటే కొరియర్ అనే కోడ్ బాషను ఏర్పాటుచేసుకొన్నట్టుగా పోలీసులు పసిగట్టారు. ఈ మేరకు పెద్దఎత్తున డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
కెల్విన్‌కు ఇతర ముఠాలతో సంబంధాలు

కెల్విన్‌కు ఇతర ముఠాలతో సంబంధాలు

అధికారులు అనుమానించినట్టుగానే కెల్విన్ ముఠాకు బ్రెండెన్, నిఖిల్‌శెట్టిలతో సంబంధాలున్నట్టుగా కెల్విన్ పోలీసుల విచారణలో బయటపెట్టినట్టు సమాచారం. నాలుగేళ్ళ క్రితం బ్రెండెన్ తనను సినీ వర్గాలకు తొలిసారి పరిచయం చేశాడని అప్పటినుండే వారికి దగ్గరైనట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

సినీ ప్రముఖులకు పదే పదే ఫోన్లు

సినీ ప్రముఖులకు పదే పదే ఫోన్లు

సినీ ప్రముఖులతో కెల్విన్ తరచూ ఫోన్‌లో సంబాషణలు జరిపేవాడని, లేదా వారితో ఛాటింగ్‌లో టచ్‌లో ఉండేవాడని తేలింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడితో కెల్విన్ 185 సార్లు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఆయన వాట్సాప్ మేసేజ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసేవారని ఎంత కావాలో కోడ్ రూపంలో చెబితే ఆ మేరకు కెల్విన్ డ్రగ్స్ సరఫరాచేసేవారని కెల్విన్ పోలీసులకు వివరించినట్టు తెలిసింది.

సీక్రెట్ ఫోల్డర్ డీకోడ్ చేసేందుకు పోలీసుల ప్రయత్నాలు

సీక్రెట్ ఫోల్డర్ డీకోడ్ చేసేందుకు పోలీసుల ప్రయత్నాలు

కెల్విన్ ఫోన్‌లో లభ్యమైన సీక్రెట్ ఫోల్డర్‌ను కూడ అధికారులు డీకోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణలో భాగంగా కెల్విన్ ఫోన్‌లోని సీక్రెట్ ఫోల్డర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఫోల్డర్‌లో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసే ప్రయత్నాలను చేస్తున్నారు. అంతేకాదు కెల్విన్ నుండి మూడు సిమ్‌కార్డులను కూడ స్వాధీనం చేసుకొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police are learnt to have decoded a secret folder in Calvin's cellphone. The officials are preparing a second list of the his clientele based on that folder. For further information, the SIT officials would take another 3 persons into custody on Monday. So far, 14 people have been arrested in the drugs case.
Please Wait while comments are loading...