Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగులో మాట్లాడిన ప్రధాని మోడీ: తెలంగాణా ఆర్ధిక కేంద్రం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!!

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలలో పాల్గొన్నారు. వర్చువల్ గా ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఫ్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పార్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

జాతీయ రహదారులు, రైల్వే ఉత్పాదక కేంద్రాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. మేడ్చల్-వరంగల్ మధ్య 108 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్ధాపన చేశారు. నాగపూర్-విజయవాడ కారిడార్కు సంబంధించి రెండు జాతీయ రహదారులపై వాహనదారులకు దీనివల్ల 34 కిలో మీటర్ల మేర ప్రయాణం తగ్గుతుంది.

modispeechatwarangal

అలాగే, కరీంనగర్-వరంగల్ సెక్షన్ లో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లకు విస్తరీంచే పనులకూ ప్రధాని పునాదిరాయి వేశారు. దీనివల్ల హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ సెజ్ లకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 'తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు' అంటూ మాట్లాడారు. తెలంగాణా గవర్నర్ తమిళి సై తో పాటు వేదికపై ఉన్న వారిని, తెలంగాణా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ప్రధాని మోడీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ప్రముఖమైనదని, ఎన్నో పరిశ్రమలకు తెలంగాణ వేదికగా మారిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణా ఆర్ధిక కేంద్రంగా మారిందన్న్నారు.

తెలుగు వారి సామర్ధ్యం దేశ సామర్ధ్యాన్ని పెంచిందని మోడీ పేర్కొన్నారు. ఈ కారణంగానే భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఐదవ దేశంగా అవతరించిందని అన్నారు. ఇందులోనూ తెలంగాణా భూమిక ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టటానికి ఎంతో మంది పెట్టుబడుదారులు వస్తున్నారని, భారత్ అలా ఎదిగిందని మోడీ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణా అత్యంత శక్తివంతంగా ఉందని, ఇక్కడి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో గొప్పదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+