ప్రధాని మోడీ పర్యటన... ఆ ప్రకటనపైనే అందరిలో ఉత్కంఠ!!
ఎన్నికల సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటనలో ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగించనున్న కారణంగా మోడీ ఒక ప్రకటన చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ బిసి ఆత్మగౌరవ సభలో ఏం చెప్పబోతున్నారు? దాని ప్రభావం ఎన్నికల పైన ఏవిధంగా ఉండబోతుంది? అన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధానమంత్రి, LB స్టేడియంలో జరిగే BC ఆత్మ గౌరవ సభలో ప్రసంగించనున్నారు.

BJP ఎన్నికలలో విజయం సాధిస్తే BC నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఇప్పటికే ప్రకటించటంతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తారా అన్న అంశంపైఅంతటా ఆసక్తి నెలకొంది. ఇలా ఉండగా, ప్రధానమంత్రి రాక నేపధ్యంలో ఆయన కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో ఈ సాయంత్రం వాహనాల రాకపోకలను పోలీసులు ఇతర మార్గాలకు మళ్ళించారు.
ఇప్పటికే ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని భద్రత చర్యలు చేపట్టిన అధికారులు, సాయంత్రం ట్రాఫిక్ దారి మళ్లింపు లను విధించారు. ఇక నరేంద్ర మోడీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్న నేపథ్యంలో లక్ష మంది వరకు జన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేయాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ పనిలో నిమగ్నమైంది.
ఇలా ఉండగా మూడు రోజుల తర్వాత, ఈ నెల 11 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బిజెపి భావిస్తున్న క్రమంలో బిజెపి జాతీయ నాయకత్వం కూడా ప్రచారంపై ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.
-
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications