Modi, Revanth: రేవంత్ ఎలా ఉన్నావు.. మోడీ పలకరింపు..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. మోడీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ఆదిలాబాద్ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు.
Recommended Video

ఆ తర్వాత సభలో పాల్గొన్నారు. సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడి పక్కన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఎడవ వైపున సీఎం రేవంత్ రెడ్డి కూర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడీ రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడి ఉంటారని చర్చ కొనసాగుతోంది.

గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాన నరేంద్ర మోడీని కలిసేందుకు సీఎం ఇష్టపడలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రొటోకాలు పాటిస్తూ.. రాష్ట్ర ప్రజయోజనాల కోసం పని చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధిస్తామని చెబుతున్నారు. కాగా మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మోడీ సభ అనంతరం మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లనున్నారు.
తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రధాని సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. మంగళవారు సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిశాకు వెళ్తారు. ఈ రెండు రోజుల్లో తెలంగాణలో మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
LIVE: PM Modi inaugurates, dedicates & lays foundation stone of projects in Adilabad, Telangana https://t.co/UIYWqzEI7v
— G Kishan Reddy (@kishanreddybjp) March 4, 2024
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ మొత్తంలో పోలీసు బలగాలు మోహరించాయి. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి సహకరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.












Click it and Unblock the Notifications